prabhas

Movie News: ప్రభాస్ పై కృష్టవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇటీవల ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏమనగా టాలీవుడ్ ప్రభాస్‌ను సరిగా వినియోగించుకోవడం లేదని ఖడ్గం రీ-రిలీజ్ సందర్భంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఈ విషయాన్ని పంచుకున్నారు ఆయన ప్రభాస్‌ గురించి మాట్లాడుతూ ఆయన అత్యంత ప్రతిభావంతమైన నటుడని తన పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు అయితే టాలీవుడ్‌లో ఆయన టాలెంట్‌ని పూర్తిగా వినియోగించడం లేదని ముఖ్యంగా ఆయన్ను యాక్షన్ పాత్రలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని తెలిపారు.

కృష్ణవంశీ తన గత అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ చక్రం సినిమా సమయంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని తెలిపారు అదే సమయంలో మరో యాక్షన్ కథ కూడా ప్రభాస్‌కు వినిపించగా ప్రభాస్ సర్ అందరూ యాక్షన్ కథలే చెబుతున్నారు అని అన్నారు దీంతో ఆయన చక్రం కథను ఎంచుకున్నారని చెప్పిన కృష్ణవంశీ ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదని అభిప్రాయపడ్డారు 20 ఏళ్ల తర్వాత కూడా ప్రభాస్‌ను యాక్షన్ కథలకే పరిమితం చేస్తున్నారని, ఆయన వాస్తవమైన నటనను చూపించే అవకాశాలు దర్శకులు ఇవ్వట్లేదని వ్యాఖ్యానించారు.

ఇంకా కృష్ణవంశీ గతంలో ప్రభాస్‌కు వినిపించిన సబ్జెక్టుతో ఇప్పుడు సినిమా చేయవచ్చని తెలిపారు కానీ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారని ఆయనకు సమయం దొరక్కపోవడం వల్ల సినిమా రూపుదిద్దకపోవచ్చని అన్నారు ఆయన తన ఇంటర్వ్యూలో ఇతర ప్రాజెక్టులను పక్కన పెట్టి నా సినిమా చేయండి అని ప్రభాస్‌కు చెప్పలేను కదా అని వ్యంగ్యంగా చెప్పారు ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాయి కృష్ణవంశీ వ్యాఖ్యలు ఒకరకంగా తెలుగు చిత్ర పరిశ్రమలో గల పెద్ద సవాలును చూపిస్తున్నాయి ప్రభాస్ వంటి ప్రతిభాశాలి నటుడు యాక్షన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్న కథా చిత్రాలలో నటించే అవకాశం పొందితే ఆయన నటనకు మరింత గౌరవం దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    Related Posts
    Unstoppable with NBK S4: మనసులో మాట బయటపెట్టిన బాలయ్య
    sreeleela naveen polishetty

    నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం కావడం ప్రారంభించిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ప్రేక్షకులను అట్టహాసంగా అలరిస్తోంది. సినీ, రాజకీయ రంగాల నుంచి Read more

    Most Handsome Actor: ప్రపంచంలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ఎవరో తెలుసా? షారుక్ ఖాన్‌కు పదో స్థానం
    shah rukh khan

    ప్రపంచంలో అత్యంత అందమైన నటుల జాబితా గురించి ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డిసిల్వా తయారు చేసిన ఒక లిస్ట్ ఇటీవల బయటకు వచ్చింది. ఇందులో బాలీవుడ్ Read more

    బలగం బ్యూటీ ఛాన్స్ వస్తే వదులుకోను అంటుంది
    kavya kalyan ram

    తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటీ కావ్య కళ్యాణ్ రామ్, చిన్నపాటి వయస్సులోనే సినిమాల్లో అడుగు పెట్టింది. 2003లో వచ్చిన "గంగోత్రి" Read more

    వజ్రం కోసం పరుగు
    vajram

    ‘ఆజ్ కీ రాత్‌’ అంటూ ‘స్త్రీ 2’ చిత్రంలోని ప్రత్యేక గీతంతో ఇటీవల బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన తమన్నా మరో హిందీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు Read more

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *