Movie: 250 కోట్లు పెట్టిన ఫ్లాప్ అయిన సినిమా

Movie: 250 కోట్లు పెట్టిన ఫ్లాప్ అయిన సినిమా

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఘటనలు ఎక్కువయ్యాయి. గతంలో ఇండియన్ సినిమాలు కేవలం దేశీయ ప్రేక్షకులకు పరిమితమయ్యే పరిస్థితి ఉండగా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధిస్తున్నాయి. అయితే, కంటెంట్ లేకుండా భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మిస్తే ఆర్థికంగా నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Advertisements
Theatre TOI e27862

భారతీయుడు 2 – భారీ అంచనాలకు తక్కువ వసూళ్లు!

శంకర్ దర్శకత్వం వహించిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బాక్సాఫీస్‌ వద్ద అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ సాధించలేకపోయింది. కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘కంగువా’ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియా చోటే మియా’ కూడా భారీ నష్టాలను మిగిల్చిన మరో సినిమా. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మైదాన్’, భారత జాతీయ ఫుట్‌బాల్‌ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది. రూ 250 కోట్లు ఖర్చు పెడితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేసింది మాత్రం రూ.68 కోట్లు మాత్రమే. అది కూడా నెట్ కలెక్షన్లు. అంటే ఈ సినిమాకు రూ.50 కోట్లు కూడా షేర్ రాలేదు. ఈ లెక్కన పెట్టిన పెట్టుబడిలో కనీసం 30 శాతం డబ్బులు కూడా తిరిగి రాలేదు.అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినప్పటికీ, ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Related Posts
KTR: సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన కేటీఆర్
KTR 5 V jpg 442x260 4g

ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కేటీఆర్, ఇటీవల గుండెపోటుతో కూతురు గాయత్రి ఆకస్మికంగా మృతి చెందడంతో తీవ్ర దుఃఖంలో ఉన్న Read more

క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి ఎవరంటే?
క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న బాలీవుడ్ నటి ఎవరంటే.

సంతోషాన్ని పంచుకునే వాళ్లతో పాటు, కష్టాలను కూడా పంచుకునేవాళ్లు నిజమైన ఆప్తులు.మనం బాధల్లో ఉండగా, మనతో ఉండి ధైర్యం చెప్పేవాళ్లు అరుదు.ఈ క్రమంలో, బాలీవుడ్ నటి హీనా Read more

ఇష్క్ చిత్రాన్ని మళ్ళీ విడుదలకు సిద్ధంగా ఉంది ఎప్పుడంటే
ishq

టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన యంగ్ హీరో నితిన్, జయం సినిమాతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, అతని కెరీర్‌కు నిజమైన మలుపు ఇచ్చిన సినిమా Read more

తండ్రి వర్ధంతికి బాలకృష్ణ ఘన నివాళి…
Great Tribute to Balakrishna at NTR Ghat

హైదరాబాద్‌: నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో సోదరుడు రామకృష్ణతో కలిసి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×