ఆగస్టు 29న వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రేపు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో పసుపు కండువాలు కప్పుకోనున్నారు. వారివెంట పెద్దఎత్తున అనుచరులు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉంది. 2019 డిసెంబర్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన మస్తాన్రావు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరనున్నారు.