Monthly leave for female employees at Acer India

Acer India: ఏసర్ ఇండియా..మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం

Acer India : ప్రముఖ ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌అండ్‌టీ బాటలోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఏసర్ ఇండియా మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. నెలసరి సమయంలో ఒక రోజు పెయిడ్‌ లీవ్‌ ను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇది మహిళల సాధారణ సెలవులపై ఎలాంటి ప్రభావం లేకుండా నెలసరి సమయంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి వీలు కల్పిస్తుందని తెలిపింది. మాతృక పేరిట ఈ లీవ్‌ను అందించనుంది. మాతృక నెలసరి విధానంతో.. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టిసారించాం అని ఏసర్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కోహ్లీ అన్నారు.

Advertisements
ఏసర్ ఇండియా మహిళా ఉద్యోగులకు

5 వేల మంది మహిళా ఉద్యోగులకు ప్రయోజనం

కొన్నివారాల క్రితం ఎల్‌అండ్‌టీ సంస్థ ఈ తరహా లీవ్‌ను ప్రకటించింది. దానివల్ల సుమారు 5 వేల మంది మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌ ఆ మేరకు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఎల్‌అండ్‌టీ మాతృ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనం వర్తించనుంది.

నెలసరి సెలవులు మంచి నిర్ణయమే

ఫైనాన్షియల్‌, టెక్నాలజీ వంటి అనుబంధ సంస్థల్లో పనిచేసే వారికి వర్తించదు. ఇక, ఇప్పటికే స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ఇదే తరహా ప్రకటన చేశాయి. బిహార్‌, ఒడిశా, సిక్కిం, కేరళ రాష్ట్రాలు సైతం నెలసరి సెలవు విషయంలో పాలసీని అమలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు గతేడాది ఈ విషయంలో ఓ పాలసీని రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. నెలసరి సెలవులు మంచి నిర్ణయమే అయినప్పటికీ.. దానివల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరంకాకుండా చూసుకోవాలని అభిప్రాయపడింది.

Related Posts
మిస్ వరల్డ్ – భారత్ తరఫున పోటీలో ఈమెనే
nandini gupta

ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ మిస్ వరల్డ్ ఈసారి భారతదేశంలోనే జరుగనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ట్రంలో మే 7 నుండి 31 వరకు Read more

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు..!
Surrender of a key Maoist leader..!

లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర నిర్భందాలు పెరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ Read more

బీజేపీకి అభినందనలు తెలిపిన కేజీవాల్
aravind tweet

ఢిల్లీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తామని అరవింద్ కేజ్రివాల్ తెలిపారు. విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఆశలతో కమలం పార్టీకి ప్రజలు గెలుపును అందించారని, Read more

CM Revanth Reddy : ప్రభుత్వ వైద్యులను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy praises government doctors

CM Revanth Reddy : హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ వైద్యులను ప్రశంసిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘నేను రానుబిడ్డో సర్కారు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×