ఇటీవల కాలంలో కుటుంబ వివాదాలతో మోహన్‌బాబు మీడియా, కోర్టుల కేసులతో మరింతగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే మల్లి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో వివాదాలతో మోహన్‌బాబు మనస్థాపానికి గురయ్యారు. తాజాగా మంచు మనోజ్ మంత్రి లోకేష్ ను కలిసారు. ఈ సమయంలోనే మోహన్‌బాబు వేగంగా పావులు కదిపారు. కొత్త నిర్ణయం దిశగా ప్రకటన కు సిద్దమయినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల ముందు జగన్ ను కలిసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసారు. వైఎస్ కుటుంబంతో మోహన్ బాబుకు వియ్యం ఉంది. 2019 లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మోహన్‌బాబు కు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు దక్కుతాయని అందరూ భావించారు. అయితే మోహన్ బాబు కు ఎలాంటి పదవి దక్కలేదు. వైసీపీతోనూ మోహన్‌బాబు దూరంగా ఉంటూ వచ్చారు. మధ్యలో మంచు విష్ణు తాడేపల్లిలో జగన్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన మోహన్ బాబు ఆ సమయంలో బీజేపీలో చేరుతారనే సంకేతాలు ఇచ్చారు. కాగా, కొంత కాలంగా మంచు కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. కేసుల వరకు వెళ్లాయి. ఈ మధ్య కాలం లోనే మోహన్‌బాబు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసారు. సుదీర్ఘంగా చర్చలు జరిగాయి.
మనోజ్ భేటీతో మోహన్‌బాబు వర్సిటీ ఆవరణలో చంద్రబాబుతో కలిసి ఉన్న డిజిటల్ బోర్డుల ఏర్పాటు వేళ తాను తిరిగి టీడీపీలోకి వెళ్తున్నాననే సంకేతాలు ఇచ్చినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప తెరకెక్కుతోంది. ఇదే సమయంలో మంచు మనోజ్ అయితే నేరుగా నారావారిపల్లి లో లోకేష్ తో సమావేశం అయ్యారు. మనోజ్ తొలి నుంచి టీడీపీ – జనసేన ముఖ్యులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.