హైదరాబాద్: మంచు కుటుంబంలో గొడవలు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఈక్రమంలోనే నటుడు మోహన్‌బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రిపోర్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి వద్ద పోలీస్ పీకెట్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. తాను సెక్యూరిటీ కోరినప్పటికీ భద్రత కల్పించలేదని.. వెంటనే తనకు భద్రత కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మోహన్ బాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌ను హైకోర్టు మధ్యాహ్నం 2.30కి విచారించనుంది.
గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో మంటలు చర్చనీయాంశంగా మారాయి. మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య నెలకొన్న వివాదం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. జన్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మంచు మనోజ్ తన భార్య సతీమణితో కలిసి రావడం.. అక్కడ వారిని రానీయకుండా మంచు విష్ణు ఏర్పాటు చేసిన బౌన్సర్లు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు మనోజ్ బౌన్సర్లు, మంచు విష్ణు ఏర్పాటు చేసిన బౌన్సర్ల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మంచు మనోజ్ ఎవరినీ లెక్క చేయకుండా గేట్లను బద్దలు కొట్టుకుంటూ ఇంట్లోకి దూసుకెళ్లిపోయారు. ఆ తరువాత చిరిగిన చొక్కాతో ఆయన బయటకు వచ్చారు.
మరోవైపు జల్‌పల్లిలో మోహన్ బాబు ఇంటివద్ద మీడియాపై జరిగిన దాడి ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయినట్లు సమాచారం. మోహన్ బాబు చూట్టూ ఉన్న బౌన్సర్లను బైండోవర్ చేయాలని.. అలాగే మోహన్ బాబు విష్ణు దగ్గర ఉన్న గన్లను కూడా డిపాజిట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.