త్వరలో సింగపూర్ కు మోడీ.. ఎందుకంటే..?

ప్రధాని నరేంద్రమోదీ త్వరలో సింగపూర్లో పర్యటిస్తారని ఆదేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ అన్నారు. రెండు దేశాల మంత్రుల రౌండ్బుల్ సమావేశాలు ఫలవంతంగా సాగాయన్నారు. డిజిటల్, నైపుణ్యాభివృద్ధి, వైద్యం, కనెక్టివిటీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంశాల్లో ద్వైపాక్షిక సహకారం మెరుగుదలకు అవకాశాలను అన్వేషించామన్నారు. సెమీ కండక్టర్ల తయారీ, వైమానిక రంగంలో సహకారంపై చర్చించామని పేర్కొన్నారు.