చంద్రబాబు కుటుంబ సభ్యులతో మోడీ గ్రూప్ ఫోటో

ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. అలాగే పలు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున రాజకీయ , సినీ ప్రముఖులు హాజరై సందడి చేసారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా ప్రధాని మోదీ… సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫొటోలో మోదీతో పాటు చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, నారా దేవాన్ష్ ఉన్నారు. మోదీ… లోకేశ్ తనయుడు దేవాన్ష్ భుజాలపై చేతులేసి చిరునవ్వులు చిందిస్తూ నిల్చుని ఉండడం ఈ ఫొటోలో చూడొచ్చు.