తెలంగాణ ప్రభుత్వం ..అభివృద్ధికి సహకరించడం లేదంటూ మోడీ ఫైర్

ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన లో తెలంగాణ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణలో కేంద్రం చేపడుతున్న అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ..దీనివల్ల ప్రాజెక్టుల పనులు ఆలస్యం అవుతున్నాయని మోడీ అన్నారు.

రాష్ట్రంలో కుటుంబం పాలన అవినీతిని పెంచిపోషిస్తుందన్నారు. సొంత కుటుంబం ఎదిగితే చాలనుకుంటారు.. అన్ని విషయాల్లో వారికి కుటుంబ స్వార్థమే కావాలంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటివారితో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వారసత్వ రాజకీయంతో అవినీతిని పెంచి పోషిస్తున్నారు.. అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా వద్దా? అంటూ ప్రజలను కోరారు. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి.. కోర్టుకు వెళ్లారు, అక్కడా వారికి షాక్‌ తగిలిందంటూ విమర్వించారు.

అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అంటూ ప్రజలను ప్రశ్నించారు ప్రధాని మోడీ. కుటుంబ పాలకులే అన్నింటిపైనా కంట్రోల్ కోరుకుంటారని.. అలాంటి వారి వల్ల ప్రజలకు నష్టమన్నారు. అలాంటి వ్యక్తుల నుంచి తెలంగాణను కాపాడాల్సిన అసవరం ఉందా లేదా అంటూ ప్రజలను ప్రశ్నించారు మోడీ. అవినీతిపై పోరాడాలా వద్దా.. అవినీతిని తరిమి కొట్టాలా వద్దా.. తెలంగాణ ప్రజలు చెప్పాలంటూ పిలుపునిచ్చారు. అవినీతి చిట్టా బయటకు వస్తుందనే భయంతోనే విపక్షాలు అన్నీ కోర్టుకు వెళ్లాయన్నారు. అవినీతిపరులపై పోరాటానికి తెలంగాణ ప్రజల సహకారం కావాలని మోడీ కోరారు. బీజేపీని అశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.