MMTs rape incident.. accused identified

MMTS: ఎంఎంటీస్ అత్యాచార ఘటన.. నిందితుడి గుర్తింపు

MMTS : హైదరాబాద్‌ ఎంఎంటీఎస్ ట్రెయిన్‌లో అత్యాచారయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అమ్మాయిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన జంగం మహేష్ అనే యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంన్న మహేష్ గంజాయికి బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈనెల 23న ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కిన మహేష్ ఒంటరిగా ఉన్న అమ్మాయిపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకునే క్రమంలో ట్రైన్ నుంచి దూకి ఆమె తీవ్రంగా గాయపడింది. మహేష్‌ ఫోటోను ట్రీట్‌మెంట్ తీసుకుంటుంన్న అమ్మాయికి చూపించగా నిందితుడు అతడే అని గుర్తించింది. దీంతో పోలీసులు మహేష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Advertisements
ఎంఎంటీస్ అత్యాచార ఘటన నిందితుడి

ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహం

కాగా, ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువతి ఈనెల 23న సికింద్రాబాద్ నుంచి మేడ్చల్‌కు వెళ్లేందుకు ఎంఎంటీఎస్ ట్రైన్‌లోకి ఎక్కగా.. ఒంటరిగా ఉన్న ఆమెపై ఓ దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో కదులుతున్న ట్రైన్ నుంచి ఆమె కిందకు దూకగా.. తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అత్యాచార ఘటనపై కీలక అప్డేట్ వ్చచింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Related Posts
కొత్త వ్యూహాలతో ముందుకువెళ్తున్న జగన్ కేసీఆర్
కొత్త వ్యూహాలతో ముందుకువెళ్తున్న జగన్ కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఇద్దరూ ఎన్నికల్లో ఓటమి అనంతరం రాజకీయ Read more

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?
liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా Read more

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శాతం ఎంత వరకు వచ్చిందంటే..!!
door to door survey

తెలంగాణ రాష్ట్ర సర్కార్ స‌మ‌గ్ర ఇంటింటి కుటుంబ స‌ర్వే చేస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ 09 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే ప్రారంభమైంది. ప్రతి ఇంటికి Read more

Myanmar Earthquake: మయన్మార్ లో 5 రోజుల తర్వాత శిథిలాల నుంచి బయట పడ్డ యువకుడు
Myanmar Earthquake: మయన్మార్ లో 5 రోజుల తర్వాత శిథిలాల నుంచి బయట పడ్డ యువకుడు

మయన్మార్ లో భూకంపం – వేలాది ప్రాణనష్టం మయన్మార్‌లో ఇటీవల సంభవించిన భూకంపం దేశాన్ని తీవ్రంగా వణికించింది. ఈ భూకంపం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×