MMRPS calls for protests ac

రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు ఎమ్మార్పీఎస్ పిలుపు

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. మాలలకు అనుకూలంగా ఉంటూ… మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు.

రేవంత్ స‌ర్కార్ త‌మ‌కు న‌మ్మ‌క ద్రోహం చేసింద‌ని మందకృష్ణ ధ్వ‌జ‌మెత్తారు. మాదిగ‌ల‌కు సీట్లు త‌గ్గ‌డానికి కూడా రేవంత్ రెడ్డినే కార‌ణం అన్నారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ లేకుండానే ఉద్యోగ నియామ‌కాలు చేప‌డుతున్నారు. అసెంబ్లీలో ప్ర‌క‌టించిన మాదిరిగా.. రేవంత్ రెడ్డి అన్ని ప్ర‌భుత్వ ఉద్యోగ నోటిఫికేష‌న్ల‌లో ఎస్సీ రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని మంద‌కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో రేపు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వ‌హించి, ధ‌ర్నా చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లోని అంబేద్క‌ర్ విగ్ర‌హాల నుంచి క‌లెక్ట‌ర్లేట్ల వ‌ర‌కు ర్యాలీలు చేప‌ట్టాల‌న్నారు. అనంత‌రం జిల్లాల్లో క‌లెక్ట‌ర్ల‌కు విన‌తిప‌త్రాలు అందించాలని పేర్కొన్నారు.

Related Posts
జవాహర్ లాల్ నెహ్రూ: భారతదేశానికి శక్తివంతమైన నాయకత్వం ఇచ్చిన వ్యక్తి
jawaharlal nehru2

జవాహర్ లాల్ నెహ్రూ, భారతదేశం యొక్క తొలి ప్రధాని మరియు స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ స్వాతంత్ర్యానికి ఎన్నో త్యాగంచేసి, భారతదేశాన్ని ఆర్థిక, సామాజిక, రాజకీయ దృష్టుల నుండి ఆధునిక Read more

అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన..స్పందించిన హోంమంత్రి అనిత
Home Minister Anitha Says Focused on Women Security in AP

అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జ‌రిగిన‌ అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 48 Read more

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు
AP Cyclone Dana

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర Read more

ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై మంచు లక్ష్మి అసహనం
ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై మంచు లక్ష్మి అసహనం

మంచు లక్ష్మి ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే అప్పుడు సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారు అంటూ అసహనం వ్యక్తం చేసారు. ఆమె గోవాలో ఎక్కిన 6E585 విమానంలో ప్రయాణించే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *