హాస్పటల్ నుండి కవిత డిశ్చార్జ్

లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) కేసు లో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ను ఢిల్లీ లోని దీన్ దయాల్‌ హాస్పిటల్‌కు తరలించారు. కవిత హాస్పటల్ లో చేరిందనే వార్త కుటుంబ సభ్యులను , పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేసింది. గత కొంతకాలంగా కవిత లోబీపీతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు ఏమైందో అని అంత అరా తీయడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం కవిత ఆరోగ్యం బాగానే ఉండడం తో డాక్టర్స్ డిశ్చార్జ్ చేసారు. దీంతో అధికారులు ఆమెను మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. కవిత క్షేమంగా ఉన్నారని తెలియడంతో గులాబీ కార్యకర్తలు ఊపీరి పీల్చుకున్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 11న సీబీఐ అధికారులు ఆమెను జైల్లోనే అదుపులోకి తీసుకున్నారు. కవిత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు.