jeevan madhu

MLC జీవన్ రెడ్డికి భరోసా ఇచ్చిన మధుయాష్కీ గౌడ్

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కలిసి ఆయన అనుచరుడు గంగారెడ్డి హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఈ సమావేశం తర్వాత మధుయాష్కీ మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి కాంగ్రెస్ అభివృద్ధికి చేసిన కృషి విలువైనదని, ఆయన సేవలు పార్టీకి ఎప్పటికీ అవసరమని ప్రశంసించారు. ప్రభుత్వం పాలనపై ఉన్న అభ్యంతరాలను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమీక్షించాలని జీవన్ రెడ్డికి హామీ ఇచ్చారు.

తాజాగా జరిగిన గంగారెడ్డి హత్య నేపథ్యంలో జీవన్ రెడ్డి సైతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గంగారెడ్డి హత్య వెనుక స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మధుయాష్కీ, జీవన్ రెడ్డిల భేటీతో రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించడంతో, ఈ ఘటనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చూస్తున్నారు.

Related Posts
రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కొత్త ప్రాజెక్టు
A new project of realty company Brigade Enterprises

హైదరాబాద్‌: దిగ్గజ రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.4500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లొ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రకటించింది. కోకపేట్లోని నియోపోలిస్ సమీపంలో 10 ఎకరాల్లో 'బ్రిగేడ్ Read more

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికపై తీన్మార్ మల్లన్న సవాల్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపికపై తీన్మార్ మల్లన్న సవాల్

కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న తీన్మార్ మల్లన్న, బీసీ వర్గాలకు హామీ ఇచ్చినట్లుగా 42% రిజర్వేషన్లు అమలు Read more

ఎగ్జిట్ పోల్స్: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు నవంబర్ 23న ప్రకటించబడతాయి
exit poll

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో జరిగిన ఉత్కంఠభరితమైన ఎన్నికల తరువాత, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలలో ఎన్నికలు తీవ్రమైన పోటీల మధ్య సాగాయి. Read more

రెడ్ బుక్ అంటే వైఎస్సార్సీపీకి భయం ఎందుకు?: నారా లోకేష్
రెడ్ బుక్ అంటే వైఎస్సార్సీపీకి భయం ఎందుకు?: నారా లోకేష్

నారా లోకేష్ కోర్టు విచారణకు హాజరైన తర్వాత విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలపై విమర్శలు గుప్పించారు. తమ దావోస్‌ పర్యటనను విమర్శిస్తూ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *