mla kolikipudi srinivasa ra 1

రైతులపై టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి వివాదాస్పద వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఆయన దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ‘ఎన్నికల ఫలితాలకు ముందే రూ.లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించా. అదంతా రైతుల కోసమే కదా? కానీ ఈ రోజు నాకు అండగా ఏ రైతు అయినా వచ్చారా? కుక్కలకు విశ్వాసం ఉంటుంది, కొందరికి ఉండదు’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దూషించడంతో చిట్యాల సర్పంచ్‌ తుమ్మలపల్లి శ్రీనివాసరావు సతీమణి ఆత్మహత్యకు యత్నించడం ఇటీవల దుమారం రేపింది. దీంతో ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేశారు. అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారు. దీంతో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే లక్షల రూపాయలు పెట్టి పంట కాలువల్లో పూడిక తీయించానని కొలికిపూడి గుర్తు చేశారు. అదంతా రైతుల కోసమే చేశానని చెప్పారు. అయినప్పటికీ ఈ రోజు తనకు అండగా ఏ ఒక్క రైతు రాలేదని ప్రశ్నించారు. కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. కానీ కొందరికి ఉండదని వ్యాఖ్యానించారు. ఇదే మాటను ఒకటికి రెండు సార్లు కొలికిపూడి నొక్కి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Related Posts
ఫ్యాషన్ ప్రపంచంలోకి ‘ద వన్ అండ్ వోన్లీ ’
'The One and Only' way into the world of iconic and today's latest fashion

ముంబయి : బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఇప్పటి వరకు తమ అత్యంత గొప్ప ఎడిషన్ ను విడుదల చేసింది. ఫ్యాషన్ కేవలం ప్రారంభం మాత్రమే అయిన Read more

ఆంధ్రాలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్
women sewing

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ మహిళలు సొంతంగా ఉపాధి పొందేందుకు కుట్టుపని Read more

‘ఏక్ హై టు సేఫ్ హై’ : దేశ భవిష్యత్తు కోసం మార్గదర్శక నినాదం..
narendra modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పేదవాళ్లను, ఎస్సీ, ఎస్టీ, ఒబీసీ వారిని చిన్న చిన్న సమూహాలుగా విభజించేందుకు Read more

థియేటర్స్ లోకి మళ్లీ ‘అతిధి’
athidhi re release

మహేశ్ బాబు అభిమానులకు మరోసారి పండగ చేసుకునే సందర్భం రాబోతోంది. 2007లో విడుదలైన 'అతిథి' చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14న మళ్లీ Read more