ఎమ్మెల్యే ‌ధనపాల్ చేతుల మీదుగా..మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ అధునాతన డయాగ్నస్టిక్ సెంటర్‌ ప్రారంభం

MLA Dhanapal..Metropolis Healthcare advanced diagnostic center was inaugurated

నిజామాబాద్: భారతదేశంలో ప్రముఖ డయాగ్నస్టిక్ సర్వీస్ ప్రొవైడర్ మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ నిజామాబాద్‌లో‌ ఏర్పాటు చేసిన అధునాతన డయాగ్నస్టిక్ సెంటర్‌ను నిజామాబాద్‌ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గురువారం ప్రారంభించారు. ఇది ఈ ప్రాంతంలో మొట్టమొదటి మెట్రోపాలిస్ ప్రయోగశాలగా గుర్తించబడింది. అత్యాధునిక రోగ నిర్ధారణ సేవలు అందించనుంది. 1,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్రాథమిక పాథాలజీ నుంచి అధునాతన మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ వరకు విస్తృతమైన పరీక్షలను అందిస్తూ నెలకు 15,000 నమూనాలను నిర్వహించడానికి ఇది ఏర్పాటు చేశారు.

‌ఈ సందర్భంగా ‌మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్, సౌత్, ఈస్ట్ ఇండియా, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ బాలకృష్ణన్ జే మాట్లాడుతూ నిజామాబాద్‌లో మా మొదటి డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభించామన్నారు. ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి చేయడం, టైర్ 2, టైర్ 3 నగరాల్లో సేవలను విస్తరించడం అనే మా మిషన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని తెలిపారు. ఈ కేంద్రం అధునాతన సాంకేతికత, నైపుణ్యం కలిగిన నిపుణుల ద్వారా కచ్చితమైన, వేగవంతమైన, సమగ్రమైన రోగ నిర్ధారణను అందించడం ద్వారా నిజామాబాద్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందన్నారు. స్థానిక ఆసుపత్రులు, నిపుణులు, సాధారణ వైద్యులు, ప్రభుత్వంతో కలిసి రోగులకు ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మద్దతు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్, తెలంగాణ, ఏపీ రీజినల్ చీఫ్ ఆఫ్ ల్యాబ్ డాక్టర్ సురేష్ డీఆర్ మాట్లాడుతూ నిజామాబాద్‌కు కచ్చితమైన డయాగ్నోస్టిక్స్, సూపర్ స్పెషాలిటీ పాథాలజీ సేవలలో మా నైపుణ్యాన్ని విస్తరించడం సంతోషంగా ఉందన్నారు. ఇది వెల్నెస్, క్రానిక్ డిసీజ్ మేనేజ్‌మెంట్, ఆంకాలజీ, ట్రాన్స్‌ప్లాంట్ ఇమ్యునాలజీ వంటి సంక్లిష్ట రంగాలకు ఆధునిక సాంకేతికత, నైపుణ్యం కలిగిన నిపుణుల మద్దతుతో కచ్చితమైన రోగ నిర్ధారణ, రోగి కేంద్రీకృత సంరక్షణలో కొత్త ప్రమాణాలను సెట్ చేయడానికి అంకితభావంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీయూ హెడ్ రాజేష్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

మెట్రోపాలిస్ హెల్త్‌కేర్ భారతదేశం, విదేశాలలో ఒకే గొడుగు కింద ఉంది. దశాబ్దాల అనుభవం ఈ హెల్త్‌కేర్ సొంతం. అధిక నాణ్యతా‌ ప్రమాణాలు పాటించడంలో ప్రసిద్ధి చెందింది. అనేక నాణ్యతా అక్రిడిటేషన్‌లు పొందింది. మెట్రోపాలిస్ విస్తృత టెస్టుల కోసం భారతీయ రిఫరెన్స్ రేంజ్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఇప్పుడు దేశవ్యాప్తంగా వేలాది ప్రయోగశాలలు ఉపయోగిస్తున్నాయి.