అల్లు అర్జున్ మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తా – MLA బొలిశెట్టి

గత కొద్దీ రోజులుగా మెగా ఫ్యాన్స్‌-అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మధ్య గ్యాప్‌ పెరిగిందనే చర్చ సోషల్‌ మీడియాలో రచ్చగా మారింది. ఎన్నికల ముందు వరకు ఓ లెక్క. ఆ తరువాత లెక్క మారిందా? అంటే మెగా సర్కిల్ నుంచి ఎలాంటి కామెంట్స్ లేవు. కానీ ఎన్నికల తరువాత సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌ కొన్నాళ్లుగా రీసౌండ్‌ ఇస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌ మధ్య పోరు పాలిటిక్స్‌కు పాకింది.

మెగా ఫ్యాన్స్ మధ్యన నెలకొన్న వివాదంపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన శ్రీనివాస్.. అల్లు అర్జున్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్ అంటే తనకు తెలవదన్న బొలిశెట్టి.. ఉన్నది మెగా ఫ్యాన్స్ ఒక్కటేనన్నారు. అలా కాకుండా నేనే పెద్ద, నాకిష్టమైతే వస్తానంటే ఎవడు రమ్మన్నాడంటూ అల్లు అర్జున్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసారు.

తనకు, తమ పార్టీకి అల్లు అర్జున్ తో ఎటువంటి శత్రుత్వం లేదని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని అన్నారు. ‘మొన్న ఆయన మాట్లాడితే మాట్లాడాను. మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తాను’ అని చెప్పారు.