మిస్టర్‌ బచ్చన్‌ టాక్

రవితేజ -భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. హరీశ్‌శంకర్‌ డైరెక్షన్లో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ , సాంగ్స్ , ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా ఫై ఆసక్తి నింపడంతో సినిమా ను చూసేందుకు ప్రేక్షకులు , అభిమానులు థియేటర్స్ కు పరుగులుపెట్టారు.

మిస్టర్ బచ్చన్ చిత్రం.. అజయ్ దేవగణ్‌ రెయిడ్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. హరీష్ ఎక్కువగా రీమేక్ లు చేస్తూ..తెలుగు ఆడియన్స్ కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేస్తూ ఆకట్టుకుంటాడు. మిస్టర్ బచ్చన్ చిత్రం కూడా అలాగే తెరకెక్కించారు. కాకపోతే ప్రేక్షకుల అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయాడని అంటున్నారు. రెయిడ్ సినిమాను చూస్తే ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదని.. రైడ్ సీరియస్‌గా సాగితే.. మిస్టర్ బచ్చన్ సిల్లీగా సాగుతుంది. నవ్వించాలని హరీష్ శంకర్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలు అయినట్టుగా కనిపిస్తుంది. అన్నపూర్ణ ట్రాక్ క్రింజ్‌గా అనిపిస్తే.. సత్య ట్రాక్ ఏమో.. మిరపకాయ్‌లో సునీల్ ట్రాక్‌ను గుర్తుకు తెస్తుంటుంది.

ఇక హీరోయిన్ ట్రాక్‌ను అయితే కేవలం గ్లామరస్ కోసమే వాడుకున్నాడు. ఆమె డబ్బింగ్ కూడా అంతగా నచ్చకపోవచ్చు. భాగ్య శ్రీ అందాలను మాత్రం హరీష్ శంకర్ బాగా చూపించాడు. కుర్రాళ్లకు భాగ్య శ్రీ ఇట్టే ఎక్కేసేలా ఉంది. తెరపై పాటల్ని అద్భుతంగా పిక్చరైజ్ చేయించుకున్నాడు. మిక్కీ జే మేయర్ బాదిన బాదుడుకి తలపోటు వచ్చేలా ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం హరీష్ ఏదో చేద్దామనుకొని..ఏదో చేసాడని అంటున్నారు.