హెల్త్ కార్డుల తయారీపై మంత్రి కీలక ఆదేశాలు

హెల్త్ ప్రొఫైల్, హెల్త్ కార్డుల్లోని సమాచారం ప్రజలకు సకాలంలో వైద్యం అందించేందుకు సాయపడేలా ఉండాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. మొదట వ్యక్తుల పేరు, అడ్రస్, వృత్తి వంటి ప్రాథమిక సమాచారం సేకరించాలని, ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు, అనారోగ్య కారక అలవాట్లు వంటివి నమోదు చేయాలన్నారు. యూనిక్ నంబర్, బార్ కోడ్, ఫొటోతో హెల్త్ కార్డులను తయారు చేయాలని సూచించారు.