లిఫ్టులో చిక్కుక్కున్న మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్

వైజాగ్ లో అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల వైద్ శిబిరం

Minister Vidadala Rajini, Avanthi Srinivas, officials stuck in lift

అమరావతిః ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కొందరు అధికారులు లిఫ్టులో చిక్కుకుపోయారు. విశాఖ జిల్లా ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న విడదల రజని ఈరోజు వైజాగ్ లో అక్రిడిటేటెడ్ జర్నలిస్టుల వైద్య శిబిరం ప్రారంభించేందుకు విచ్చేశారు. ఓ ప్రైవేటు డయాగ్నొస్టిక్ సెంటర్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విడదల రజని, మాజీ మంత్రి అవంతి, అధికారులు లిఫ్ట్ ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోవడంతో అందరిలో ఆందోళన నెలకొంది.

వెంటనే స్పందించిన డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది ఎమర్జెన్సీ కీతో లిఫ్టు డోర్ తెరవడంతో మంత్రి తదితరులు బయటికి వచ్చారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్టు సామర్థ్యాన్ని మంచి అందులోకి ఎక్కడంతో అది మొరాయించినట్టు తెలుస్తోంది.