Minister Uttam Kumar warning to party MLAs and MLCs

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్..

హైదరాబాద్‌ : బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసం రేపు సీఎం రేవంత్‌తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

image

స్వాతంత్య్రం తర్వాత ఇంత శాస్త్రీయంగా, లాజికల్ గా దేశంలోని ఏ రాష్ట్రంలో కుల గణన జరగలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉండవద్దని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వివరణ ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అన్ని కులాలకు సంబంధించిన సామాజిక ఆర్థిక సర్వే జరిగింది. సర్వే పై ప్రజలు ఎవరికి ఇందులో అపోహలు అవసరం లేదన్నారు.

మొదట సమగ్ర కుటుంబ సర్వే తో పోల్చుకున్నారు.. అది పబ్లిక్ డొమైన్ లో లేని డాక్యుమెంట్. ఎస్సీ వర్గీకరణ కూడా 2011 ను ఆధారంగా చేసుకొని చేసిందే. వ్యక్తిగత వివరాలు కాకుండా.. రేపు ఎల్లుండి లోగా పబ్లిక్ డొమైన్ లో కులాల వారిగా, ఉప కులాల వివరాలను జిల్లాల వారిగా పెడతాం. సర్వే పై అపోహలు,అనుమానాలు ఉన్న కుల సంఘాల నేతలను పిలిచి.. చర్చించి నివృత్తి ఇస్తాం. కుల గణన సర్వే నివేదిక ఆధారంగా సంక్షేమం పథకాల రూపకల్పన కోసం ఉపయోగిస్తాం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

Related Posts
కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైర్
mla vivekananda goud fire o

కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్ పై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడి చేయడం తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ Read more

ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం
Etikoppaka Toys Shakatam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం లభించింది. ఈసారి జనవరి 26న ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే కవాతులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఏటికొప్పాక బొమ్మల Read more

నాలుగో విడుత రుణమాఫీని విడుదల చేసిన సీఎం రేవంత్
runamafi 4th fhace

మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధుల‌ను విడుదల చేశారు సీఎం రేవంత్. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి Read more

నేడు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
CM revanth reddy review with higher officials today

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *