ఖమ్మంలో మంత్రి తుమ్మల కు చేదు అనుభవం

ఖమ్మంలో మంత్రి తుమ్మల కు చేదు అనుభవం ఎదురైంది. రుణమాఫీ జరగలేదని చెప్పి పెద్ద ఎత్తున రైతులు తుమ్మలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆగ్రహం తో తుమ్మల రైతు ఫై చేయిసుకునే ప్రయత్నం చేసాడు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తెలంగాణ లో అధికారంలోకి రాగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రకటించినట్లే ఆగస్టు 15 న రెండు లక్షల రుణమాఫీ చేసింది. కాకపోతే అందరికి చేయలేదు. వందమంది రైతుల్లో కేవలం 15 మందికి ఆలా చేసి మిగతా వారికీ చేయలేదు.

దీంతో రుణమాఫీ జరగని రైతులంతా ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తమగా అనేక ధర్నాలు , నిరసనలు తెలియజేస్తూ తమ ఆందోళనలు ఉదృతం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం కూడా పలు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ అందరికి కాలేదని..రుణమాఫీ కానీ వారు సంబంధింత అధికారులను కలిసి పత్రాలు అందజేయాలని చెపుతున్నారు. ఈ క్రమంలో ఖమ్మం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు మంత్రి తుమ్మల చేరుకోగా..రైతులు అడ్డుకున్నారు. తమకు రుణమాఫీ జరగలేదని మంత్రి వద్ద మొరపెట్టుకోగా..అందరికి రుణమాఫీ అవుతుందని..ఆందోళన అవసరం లేదని మంత్రి నచ్చజెప్పారు.