sridarbabu

అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్

సంధ్య థియేటర్ ఘటనపై సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి తన వైఖరిని స్పష్టంచేశారు. అనుమతులు ఉన్నందునే తాను థియేటర్ వద్దకు వెళ్లానని, అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తనకు పోలీసులెవరూ మాట్లాడలేదని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. ఈ ఘటన కు ఎవ్వరు బాద్యులు కారని , అనుకోకుండా జరిగిన ఓ ఆక్సిడెంట్ అని , రేవతి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేసారు.

అల్లు అర్జున్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేయడం, రోడ్ షోలో పాల్గొనడం వంటి అంశాల్లో వాస్తవాలు ఏమిటనేది అల్లు అర్జున్‌కు కూడా తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు బాధితుల పరిస్థితులను కూడా గుర్తించాలని, వారి కుటుంబాలను పరామర్శించడం అవసరమని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం కేవలం బాధితులకు న్యాయం చేయడం మాత్రమేనని, ఆ అంశం పట్ల ఎవ్వరూ విభేదించరాదని ఆయన అన్నారు.

Related Posts
భారతదేశ నౌకాదళ దినోత్సవం!
navy day

భారత నేవీ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరుపుకుంటారు. ఈ రోజు, భారత నావిక దళం 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో నిర్వహించిన "ఆపరేషన్ ట్రైడెంట్" Read more

సీఎం రాక నేపథ్యంలో అధికారులు కొండారెడ్డిపల్లిలో భారీగా ఏర్పాట్లు
revanth

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వంత ఊరికి వెళ్లడం ప్రత్యేక సందర్భంగా నిలిచింది. ముఖ్యమంత్రి హోదాలోనే మొదటిసారిగా నాగర్ కర్నూలు జిల్లా Read more

వారి కన్నీళ్లే సర్కార్‌ను కూల్చి వేస్తాయి : కేటీఆర్‌
ktr comments on congress

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది రైతు రాజ్యం కాదని, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యమిదంటూ ఫైరయ్యారు. ఒకే Read more

బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు ఎందుకంటే?
కోడిపందేలు కేసు.. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిపై మరోసారి పోలీసుల నోటీసులు

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనంగా మారిన కోడి పందేల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మొయినాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. Read more