Minister Seethakka counter to MLC Kavitha.

Seethakka: ఎమ్మెల్సీ కవిత కు మంత్రి సీతక్క కౌంటర్..!

Seethakka: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ పరువు తీసింది. తీస్తున్నది మీ కుటుంబమే అని అన్నారు. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర అని అన్నారు. కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ అని విమర్శించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. పదేళ్ల పాటు అడుగడుగునా అన్యాయం చేశారని మండిపడ్డారు.

Advertisements
ఎమ్మెల్సీ కవితకు మంత్రి సీతక్క

పావలా వడ్డీ ఇవ్వలేదు

మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు. మహిళా కమిషన్‌కుసభ్యులు లేరు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మేము పంట కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారు.

పదేళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారు?

మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారు?. మీరు చేయలేని ఉద్యోగాల భర్తీ మేం చేస్తున్నాం. 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. మీరు అన్ని చేస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారు. బీఆర్ఎస్ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మీరు మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లతో వచ్చారు. మేము 65 సీట్లతో అధికారులకు వచ్చాము. పదేళ్లలో ఎన్ని ఇండ్లు ఇచ్చారు? అంటూ సీతక్క నిలదీశారు.

Related Posts
CM Chandrababu : అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన
Foundation stone laying ceremony for CM Chandrababu house in Amravati tomorrow

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమ‌రావ‌తిలో తన సొంతింటి నిర్మాణానికి రేపు( బుధవారం) శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8.51 గంటలకు సీఎం కుటుంబ సభ్యులు Read more

రాజ్యాంగ చర్చ కోసం లోక్ సభ, రాజ్య సభ తేదీలు ఖరారు
parliament

పార్లమెంట్‌లో సోమవారం అన్ని పార్టీల నేతలతో జరిగిన సమావేశం అనంతరం, లోక్ సభ మరియు రాజ్యసభ ఎంపీలు వచ్చే వారం రాజ్యాంగంపై చర్చను నిర్వహించేందుకు అంగీకరించారు. ఈ Read more

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి..కార్మికునికి త్రీవగాయాలు
Terrorist attack in Jammu and Kashmir.Worker injured

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్ర దాడి జరిగింది. ఈసారి పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు కాశ్మీరేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక Read more

స్వయంకృషిగల పారిశ్రామికవేత్తల జాబితా
IDFC First Private Banking and Hurun India released the list of India's Top 200 Self Employed Entrepreneurs in the Millennium 2024

హైదరాబాద్ : ఐడిఎఫ్‌సి ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్ మరియు హురున్ ఇండియా 'ఐడిఎఫ్‌సి ఫస్ట్ ప్రైవేట్ & హురున్ ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×