ప్రమాదానికి గురైన ఏపీ మంత్రి సంధ్యారాణి కాన్వాయ్

మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైంది. విజయనగరం(D) రామభద్రపురం (M) బూసాయవలస వద్ద మంత్రి ఎస్కార్ట్ వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు కాగా, వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుంచి సంధ్యారాణి తప్పించుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

గిరిజన ప్రాంతంలో అధిక వర్షాల వల్ల కలిగిన నష్టంపై మంత్రి ఆరా తీశారు. అలాగే దెబ్బతిన్న రోడ్లను పరిశీలిాంచారు.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గిరిజన గ్రామాలకు శాశ్వత రహదారుల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జీకేవీధి- సీలేరు రహదారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని.. రోడ్డు నిర్మాణాలకు అవసరమైన నిధులు వెంటనే మంజూరయ్యేలా చూస్తానన్నారు.