కరీంనగర్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్

కుల గణన సర్వేపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక కామెంట్స్..!

మూడు పద్ధతుల్లో కుల సర్వే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు బలహీన వర్గాల నాయకులు, ఫ్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరి విజ్ఞప్తి మేరకు కుల గణనలో నమోదు చేసుకొని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వారికి 16 వ తేది నుండి 28 వ తేదీ వరకు ఇప్పటి వరకు కుల సర్వే లో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలి. మూడు పద్ధతుల్లో కుల సర్వే లో సమాచారం ఇవ్వడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి తెలంగాణ సమాజంలో కుల గణన సర్వేలో నమోదు చేసుకొని వారు సమాచారం ఇవ్వనివారు సమాచారం ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్న.

Minister Ponnam Prabhakar's key comments on caste enumeration survey..!

తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి

కుల గణన సర్వే కి ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు.. విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వే లో భాగస్వామ్యులు అయ్యేవిదంగా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్న. బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా తీసుకొని ఎవరైతే తెలంగాణ కుల సర్వే లో పాల్గొనలేదో ముందుగా మీరు ,కేటీఆర్ ,హరీష్ రావు గానీ సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Related Posts
అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం రేఖా
rekha gupta sleeping

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అసెంబ్లీలో నిద్రపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సభలో సభ్యులు చర్చలు జరుపుతున్న సమయంలో ఆమె కునుకు తీశారు. ఈ Read more

తెలంగాణ సెక్రటేరియట్‌ను పేల్చి వేస్తానని బెదిరింపులు..
Threats to blow up Telangana Secretariat

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా Read more

మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా : మమతా బెనర్జీ
Religious Event Maha Kumbh Mela .. Mamata Banerjee

యూపీ సర్కారు వీఐపీలకు మాత్రమే ఏర్పాట్లు చేసిందని ఆగ్రహం కోల్‌కతా : ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కార్‌పై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో Read more

నేడు కడపలో పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan visit to Kadapa today

అమరావతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కడపకు పయనం అవుతున్నారు. ఇందులో భాగంగానే… గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ Read more