లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి నిర్మలా

Minister Nirmala presented the budget in the Lok Sabha

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2024 –25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డ్ నెలకొల్పనున్నారు. వరుసగా రెండోసారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన ఆమె.. 2024-25 బడ్జెట్‌ను సమర్పించి సరికొత్త రికార్డును బ్రేక్‌ చేశారు. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్‌లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్‌ని అధిగమించారు. మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 1959-64 మధ్య ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్‌ను మొరార్జీ దేశాయ్ ప్రవేశ పెట్టారు.