Minister Narayana has 3 wine shops

మంత్రి నారాయణకు 3 వైన్‌ షాపులు..

అమరావతి: ఏపీలో కొత్త వైన్ షాపులను నిన్న లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. లాటరీలో షాపు తగిలిన వారు సంతోషంలో మునిగిపోగా… అదృష్టం వరించని వారు నిరాశలో మునిగిపోయారు. పలు చోట్ల పలువురు వ్యక్తులు సిండికేట్లుగా ఏర్పడి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రాజకీయ నాయకులు సైతం పెద్ద ఎత్తున వైన్ షాపుల కోసం పోటీ పడ్డారు.

నంద్యాల దివంగత మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజల మద్యం షాపుల టెండర్లలో పలు షాపులు దక్కించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో ఒకటి సహా పీలేరు నియోజకవర్గంలో కూడా షాపులు దక్కించుకున్నారు.

మరోవైపు, ఏపీ మంత్రి పి.నారాయణ తన అనుచరుల కోసం రూ. 2 కోట్ల సొంత డబ్బుతో 100 మంది కార్యకర్తల ద్వారా వైన్ షాపులకు దరఖాస్తు చేశారు. 100 దరఖాస్తులకు గాను వారికి మూడు షాపులు దక్కాయి. దీంతో, ఒక్కో షాపును ఆరుగురు డివిజన్ ఇన్ఛార్జీల చొప్పున 18 మందికి ఆయన షాపులను అప్పగించారు. చట్టబద్ధంగా వ్యాపారం చేసుకోవాలని వారికి సూచించారు.

ఇంకోవైపు, మచిలీపట్నంలోని ఒకటో నెంబర్ షాపును కర్ణాటకకు చెందిన మహేశ్ బాటే దక్కించుకున్నారు. రెండో షాపు ఉత్తరప్రదేశ్ కు చెందిన లోకేశ్ చంద్ కు దక్కింది. ఈ రెండు షాపులను తమకు ఇవ్వాలని వారితో స్థానిక వ్యాపారులు బేరసారాలకు దిగినట్టు సమాచారం.

Related Posts
మంటల్లో దగ్ధమైన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు
Diwakar travels bus caught fire in anantapur

అమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్ర జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన పలు బస్సులు మంటల బారిన పడ్డాయి. అందులో Read more

గుంటూరులో వేడెక్కిన కౌన్సిల్ సమావేశం
kavati manohar

గుంటూరు కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాప్రతినిధులు, ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. దీనితో కౌన్సిల్ సమావేశం నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. గుంటూరులో Read more

త్వరలో అంతరిక్ష కేంద్రం సిద్ధం
indian space station 181852770 16x9

ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీలో వేగంగా డెవలప్ అవుతుంది. అందులో భాగంగా భారతదేశం 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకోనుందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ Read more

చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్
చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్

భారతదేశం, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *