Minister Nara Lokesh meet Union Minister Amit Shah

కేంద్రమంత్రి అమిత్ షాతో మంత్రి నారా లోకేశ్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోమంత్రి అమిత్ షాతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను అమిత్ షాకు నారా లోకేశ్ వివరించారు. ఇక రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నందుకు అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలు అధిగమించి రాష్ట్రం బలమైన శక్తిగా ఎదిగేందుకు కేంద్ర సహాయం ఉంటుందని ఈ సందర్భంగా అమిత్ షా భరోసా ఇచ్చారు.

కాగా, అమిత్ షాతో భేటీపై ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ స్పందించారు. కేంద్ర మంత్రితో చాలా మంచి సమావేశం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలను ఆయనకు వివరించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ని ఆర్థిక శక్తి కేంద్రంగా తిరిగి నిలపడానికి, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అమిత్ షా నిబద్ధతతో ఉన్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఉజ్వల భవిష్యత్తు కోసం నిరంతరం మార్గదర్శకత్వం చేస్తున్న అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపానని ఆయన చెప్పారు.

Related Posts
2024లో బ్యాంకుల విస్తరణపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ..
sitharaman

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రసంగిస్తూ , 2024 సెప్టెంబర్ నెల చివరలో బ్యాంకుల విస్తరణ గురించి వివరాలు వెల్లడించారు. 2014 నుండి 2024 మధ్య Read more

జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ముబారక్‌ గుల్‌ ప్రమాణస్వీకారం
Mubarak Gul sworn in as Protem Speaker of Jammu and Kashmir Assembly

శ్రీనగర్‌: కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో సుదీర్ఘకాలం తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడ చివరగా బీజేపీ-పీడీపీ సంకీర్ణ సర్కారు కుప్పకూలడం, జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ Read more

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సవరణకు కేంద్రం ఆమోదం
polavaram

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేందుకు సవరించిన Read more

జగిత్యాల సబ్ జైలులో గుండెపోటుతో మృతి..
jagityal

మల్యాల మం. రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం ఓ కేసులో జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *