విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేశ్‌

అమరావతి: తన పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారంటూ సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరయ్యారు. సాక్షి పత్రికపై రూ. 75 కోట్లకు పరువునష్టం దావా వేసిన లోకేశ్ తరపు న్యాయవాదులు నేడు కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

‘చినబాబు తిండికి 25 లక్షలండి’ పేరుతో 2019 అక్టోబర్ 22న సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో పేర్కొన్న అంశాలన్నీ పూర్తిగా అవాస్తవమని, తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనం రాశారంటూ కథనం ప్రచురితమైన మూడో రోజున అంటే 25న సాక్షి సంపాదక బృందానికి లోకేశ్ న్యాయవాదులు నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన సాక్షి అదే ఏడాది నవంబర్ 10న సమాధానం పంపింది.

దీనిపై సంతృప్తి చెందని లోకేశ్ ఆ సంస్థపై పరువునష్టం దావా వేశారు. విశాఖ విమానాశ్రయంలో తాను చిరుతిళ్లు తిన్నట్టు వార్తలో పేర్కొన్న తేదీల్లో తాను ఇతర ప్రాంతాల్లో ఉన్నానని, అయినప్పటికీ దురుద్దేశంతో తన పరువుకు భంగం కలిగించేలా రాజకీయ లబ్ధికోసం అసత్యాలతో కథనం ప్రచురించారని లోకేశ్ తన దావాలో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, సాక్షి ప్రచురణ కర్త మురళి, విశాఖ సాక్షి న్యూస్ రిపోర్టర్లు వెంకటరెడ్డి, ఉమాకాంత్‌లపై రూ. 75 కోట్లకు పరువునష్టం దాఖలు చేశారు.

Related Posts
గ్లోబల్ ఆర్థిక సంక్షోభంలో రూపీ ₹84.40 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరింది
rupee

ఇటీవల భారత్‌లో రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే గణనీయంగా పడిపోయింది. రూపాయి 84.40 అనే ఆల్-టైమ్ లోవ్ స్థాయికి చేరుకోవడం షాక్ ఇచ్చింది. ఫారెక్స్ వ్యాపారులు Read more

ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF)..
india international trade fair

ప్రతీ సంవత్సరం, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF) ఒక విశాలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక ప్రదర్శనగా ప్రగ్యతి మైదాన్, ఢిల్లీ లో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం, Read more

అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనపై హైకోర్టు తీర్పు
అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ప్రతిష్ఠాపనపై హైకోర్టు తీర్పు

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ప్రతిష్ఠాపనను నిలిపివేయాలని సామాజిక కార్యకర్త జెట్టి ఉమేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. Read more

పోసాని ఓ మూర్ఖ శిఖామణి అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి
పోసాని ఓ మూర్ఖ శిఖామణి అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి

టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సినీ నటుడు పోసాని కృష్ణమురళిని తీవ్రంగా విమర్శించారు.“పోసాని మూర్ఖ శిఖామణి” అని ఆయన కొట్టిపారేశారు.ఆయన మాట్లాడుతూ “ఏమాత్రం అవసరం లేకుండా Read more