Minister Nadendla Manohar : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉన్న పౌరసరఫరాల శాఖ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉంచిన బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.

నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం
ఏపీ భవన్ లో నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని మంత్రి అక్కడిక్కడే ప్రకటించారు. ఇకపై ఏపీ భవన్ లోని దుకాణం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మంత్రి నాదెండ్లతో పాటు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.
వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులకు ఆదేశం
అమ్మే బియ్యం లో నాణ్యత లేదు. 26 కేజీల బియ్యం బస్తా 25 కేజీలు మాత్రమే ఉంది. వేయింగ్ మిషన్ సైతం సరిగా పనిచేయడం లేదన్నారు. 26 కేజీల బియ్యం బస్తాను మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్ చేశారు.బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ గమనించారు. ఈ సందర్భంగా నెలలోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్ స్టోర్ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం తెలిపారు. నాణ్యమైన బియ్యంతో పాటు, సరుకులను అందిస్తాం అని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Read Also: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు..పురందేశ్వరి హర్షం