HCL Lokesh

ఏపీలో HCLను విస్తరించాలని మంత్రి లోకేశ్ వినతి

ఆంధ్రప్రదేశ్‌లో HCL సంస్థను మరింత విస్తరించి మరో 10 వేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా HCL సీఈవో కళ్యాణకుమార్‌తో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలో ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానాలపై మంత్రి లోకేశ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నట్లు మంత్రి చెప్పుకొచ్చారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. రీలొకేషన్ చేసే పరిశ్రమలు, ఎక్విప్మెంట్ ఇంపోర్టుకు 50 శాతం రాయితీలు కల్పించడంతో పాటు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

HCL ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇస్తోందని మంత్రి ప్రశంసించారు. అయితే ఇప్పుడున్న స్థాయిని మరింత విస్తరించడానికి అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ విస్తరణ ద్వారా యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. దావోస్ పర్యటన సందర్భంగా HCL వంటి సంస్థలతో జరిగిన చర్చలు రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తాయని, మున్ముందు మరిన్ని సంస్థలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు.

Related Posts
మీటింగ్‌కు హాజరుకాలేదు అనే కారణంతో 99 ఉద్యోగులను తొలగించిన CEO..
fired

ఒక US-based CEO, 99 ఉద్యోగులను ఒక్కసారిగా ఉద్యోగం నుండి తొలగించి, ఆన్‌లైన్‌లో పెద్ద చర్చలకు కారణమయ్యారు. ఈ CEO, తన సంస్థలో జరిగిన ఒక ముఖ్యమైన Read more

గంగూరు రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించిన-సీఎం
cbn1

ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా (పెనమలూరు) :ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో Read more

వర్షాలు దెబ్బకు..నీటమునిగిన టెక్ క్యాపిటల్
The rains hit the tech capi

దేశ టెక్ క్యాపిటల్ బెంగళూరు భారీ వర్షాలకు అతలాకుతలమైంది. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు ఐటీ కారిడార్ నీటమునిగింది. రోడ్లపై వరదనీరు నిలిచి ఉన్న వీడియోలు వైరల్ Read more

ఆంధ్రాకు భారీ ప్రాజెక్ట్: చంద్రబాబు ట్వీట్
chandra babu

దావోస్‌లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. రెండ రోజు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో చంద్రబాబు వరుస Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *