గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగించం : మంత్రి డోలా

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను తొలగించం : మంత్రి డోలా

ఆంధ్రప్రదేశ్ లోనిగ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగినీ తొలగించే ప్రసక్తే లేదని, అవసరమైతే కొత్త ఉద్యోగులను నియమిస్తామని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. సచివాలయంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమైన సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని, ఈ ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియపై ఐదారు సార్లు సమీక్ష నిర్వహించామని, జనాభా ప్రాతిపదికన సచివాలయ ఉద్యోగులను ఏ, బీ, సీ క్యాటగిరీలుగా నియమించాలని నిర్ణయించామని తెలిపారు. హేతుబద్దీకరణ తర్వాత అవసరమైన ఉద్యోగులను నియమించి, ఏ ఉద్యోగిపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సరైన పదోన్నతి విధానాన్ని కూడా సులభతరం చేస్తామన్నారు. ఆలస్యం లేకుండా ప్రజలకు రియల్‌టైంలో సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మరింత పారదర్శకంగా సేవలు అందించేందుకు సచివాలయాల్లో ఏఐ, డ్రోన్‌ టెక్నాలజీ, ఐవోటీలను అమలు చేస్తామన్నారు. పదోన్నతులు, మిగిలిపోయిన ప్రొబేషన్‌ డిక్లరేషన్‌, జీతం స్కేల్‌, వివరణాత్మక జాబ్‌చార్ట్‌ అంశాలను ఉద్యోగ సంఘాల నేతలు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. సచివాలయ ఉద్యోగులకు జూనియర్‌ అసిస్టెంట్‌ పేస్కేల్‌ వర్తింపచేయాలని, వివిధ క్యాటగిరీల సచివాలయ ఉద్యోగుల పదోన్నతులు, ఇతర సర్వీసు విషయాల్లో స్పష్టత ఇవ్వాలని కోరారు. హేతుబద్దీకరణ ప్రక్రియలో ఇచ్చిన జీఓఎంఎస్‌ నెం.1లోని క్లాజ్‌ 3లో చెప్పినట్లు మల్టీపర్పస్‌ కార్యదర్శులు, టెక్నికల్‌, ఆస్పిరేషనల్‌ కార్యదర్శులు ఎవరెవరు ఏయే కేటగిరి కిందకు వస్తారో పూర్తి సమాచారం ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి, వారి సమస్యలు, జీతభత్యాలు, పదోన్నతులు మరియు ఉద్యోగ మార్పులు వంటి కీలక అంశాలను సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో, 39 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, పలు ముఖ్యమైన విషయాలపై చర్చలు జరిపారు.

జనాభా ఆధారంగా ఉద్యోగుల నియామకం

గ్రామ, వార్డు సచివాలయాలకు 3,500కి పైగా జనాభా ఉన్న సందర్భాల్లో, ఉద్యోగుల పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొంటూ, 3,501 జనాభా దాటిన ప్రతి 500 లేదా 1,000 మందికి అదనంగా ఒక ఉద్యోగిని నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విధానం ద్వారా, ప్రతి సచివాలయానికి అవసరమైన మంది ఉద్యోగులను సమర్థంగా నియమించుకోవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

జీత భత్యాలు

2022లో ఇచ్చిన 11వ పి ఆర్ సిప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్‌ నెంబర్‌ 2లో సచివాలయ ఉద్యోగుల జీతభత్యాలు 2015 పీఆర్సీలోనివి యథాతథంగా ఉంచారని, ఈ తప్పు పునరావృతం కాకుండా రాబోయే 12వ పీఆర్సీలో సదరు సమస్యను సరి చూసే చర్యలు తీసుకోవాలని కోరారు. 2015 పీఆర్సీలో కేటాయించిన జీతభత్యాలు సకాలంలో పెంచడం, పాత పీఆర్సీల్లోని తప్పులను సరిచేయడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొనారు.రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు ఒకేసారి ఉద్యోగం పొందిన కారణంగా, చాలా మంది ఇప్పటి వరకు సరైన పదోన్నతికి నోచుకోలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. అందరినీ వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేసి పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగుల సమస్యలను అంగీకరించి, వాటి పరిష్కారాలపై సమీక్షలు నిర్వహించాలని, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి, సర్వీస్ రూల్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.

Related Posts
Privilege Fee: దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం ధరల సర్దుబాటు చేసిన ఏపీ సర్కారు
samayam telugu 72388726

ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానం: కీలక నిర్ణయాలు మరియు ధరల్లో మార్పులు ఏపీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ Read more

వర్మ పై వరుస కేసులు..తప్పించుకోవడం కష్టమే
varma cases

గత వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారు ..ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..వైసీపీ అధికారంలో ఉన్న టైములో టిడిపి , జనసేన Read more

ఏపీ మున్సిపాలిటీలకు నారాయణ శుభవార్త
మున్సిపాలిటీలకు స్వపరిపాలన హక్కు – మంత్రి నారాయణ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపాలిటీల అభివృద్ధికి శుభవార్త చెప్పిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం మున్సిపల్ శాఖకు మరియు సీఆర్డీఏ Read more

APSRTC:ఏపీ ఆర్టీసీలో ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్
APSRTC:ఏపీ ఆర్టీసీలో ప్రమోషన్ల ప్రక్రియకు బ్రేక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో పదోన్నతుల కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సీనియర్ అధికారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) Read more