rahul gandhi

రాహుల్ గాంధీపై పాల వ్యాపారి కేసు

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై తాజాగా బిహార్‌కు చెందిన ఓ పాల వ్యాపారి కేసు పెట్టారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యల వల్ల తాను 250 రూపాయలు నష్ట పోవాల్సి వచ్చిందంటూ.. స్థానిక కోర్టును ఆశ్రయించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయించారు. త్వరలోనే వీటిపై రాహుల్ గాంధీని విచారించాలంటూ తన పిటిషన్‌లో కోరారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు అయిన రాహుల్ గాంధీ ఇటీవలే.. ఢిల్లీ కోటా రోడ్డులో ఏర్పాటైన కాంగ్రెస్ కొత్త కార్యాలయానికి వెళ్లారు. అక్కడే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యంగా ఆర్.ఎస్.ఎస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ రెండూ కలిసి ప్రతి సంస్థను స్వాధీనం చేసుకున్నాయంటూ ఆరోపించారు. తాము ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్‌తో కూడా పోరాడుతున్నామంటూ వ్యాఖ్యానించారు.


బిహార్‌లోని సమిష్టిపూర్‌కు చెందిన పాల వ్యాపారి ముకేశ్ చౌదిరి.. రాహుల్ గాంధీ చేసిన ఈ కామెంట్లను టీవీ ద్వారా విన్నారట. ఈక్రమంలోనే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని.. సరిగ్గా అప్పుడే తన చేతిలో ఉన్న పాల బకెట్ జారి కింద పడిపోయిందని చెప్పుకొచ్చారు. బకెట్ జారిపోవడంతో అందులో ఉన్న 5 లీటర్ల పాలు నేల పాలు అయ్యయాని ముకేశ్ చౌదరి వెల్లడించారు. ఒక లీటర్ పాల ధర రూ.50 ఉండగా.. ఈ ఐదు లీటర్ల పాల ధర రూ.250 అవుతుందని.. రాహుల్ చేసిన వ్యాఖ్యల వల్లే తాను 250 రూపాయలను నష్టపోయానంటూ పేర్కొన్నారు.ముఖ్యంగా దీనిపై స్థానికంగా ఉన్న రోసెరా సబ్ డివిజన్‌లోని సివిలో కోర్టును ఆశ్రయించారు. అయితే పాల వ్యాపారి ముకేశ్ చౌదరి వేసిన ఈ వ్యాజ్యాన్ని ఆ కోర్టు అంగీకరించిందో లేదో ఇంకా తెలియదు. కానీ 250 రూపాయల కోసం రాహుల్ గాంధీపై కేసు పెట్టడంతో ఈ వార్త వైరల్‌గా మారింది.

Related Posts
ఎన్నికల హామీలపై కీలక వ్యాఖ్యలు చేసిన మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge made key comments on election promises

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన హామీలు ఇవ్వబోమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. బడ్జెట్‌ ఆధారంగా మాత్రమే హామీలు ప్రకటించాల్సిన Read more

భారతదేశ నౌకాదళ దినోత్సవం!
navy day

భారత నేవీ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జరుపుకుంటారు. ఈ రోజు, భారత నావిక దళం 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో నిర్వహించిన "ఆపరేషన్ ట్రైడెంట్" Read more

భారతదేశానికి ట్రంప్ అనుకూలమేనా?
భారతదేశానికి ట్రంప్ అనుకూలమేనా?

ఇండియా టుడే మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో 40% కంటే ఎక్కువ మంది భారతీయులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి తమ దేశానికి అనుకూలమని అభిప్రాయపడ్డారు. ట్రంప్ Read more

పండగపూట పెరిగిన బంగారం ధరలు
gold

భోగి మంటలతో పాటు బంగారం ధరలు కూడా మండుతున్నాయి. భోగి, సంక్రాంతి పండగల సమయంలో పసిడి షాపింగ్ ప్రియులకు షాక్ తగిలినట్టు అయ్యింది. అయితే నిన్నటితో పోల్చితే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *