ఇవాళ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ జరుగుతోంది

పార్లమెంట్లో మిథున్ రెడ్డి కీలక ప్రకటన

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపక్ష వైసీపీకి, అధికార పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు మధ్య సాగుతున్న పోరు నిత్యం చూస్తూనే ఉన్నాం. వైసీపీ వర్సెస్ కూటమిగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో ఇవాళ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది.పార్లమెంట్ సాక్షిగా ఓ వైసీపీ ఎంపీ, మాజీ ఫ్లోర్ లీడర్ కూడా అయిన పీవీ మిథున్ రెడ్డి.. టీడీపీ ఎంపీలతో కలిసి ఓ కీలక అంశంపై పోరాడేందుకు సిద్దమని పార్లమెంట్ లోనే తేల్చిచెప్పేశారు.

Midhun Reddy Biography

ఇవాళ లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ సీపీ తరఫున చర్చలో మాట్లాడిన ఎంపీ మిథున్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించవద్దంటూ కేంద్రాన్ని వేడుకున్నారు. ఒరిజినల్గా పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం 194 టీఎంసీలు అని, ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందేలా దీన్ని డిజైన్ చేశారని గుర్తుచేశారు. ఇరిగేషన్ తో పాటు తాగునీటి కోసం ఉపయోగించాలనేది దీని ఉద్దేశం అన్నారు.

కానీ 41.15 మీటర్లకు ప్రాజెక్టును తగ్గిస్తూ బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారని మిథున్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. దీనివల్ల పోలవరం కెపాసిటీ 194 నుంచి 115 టీఎంసీలకు పడిపోతుందన్నారు. ఇది రైతులకు, రాష్ట్రానికి తీరని అన్యాయం అన్నారు. ఈ అన్యాయం ఎదిరించేందుకు టిడిపి ఎంపీలతో కలిసి పోరాటానికి సిద్ధం అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. 115 టీఎంసీలకు పోలవరాన్ని తగ్గించడం వల్ల కేవలం 3.2 లక్షల ఎకరాలకి నీరు అందుతుందన్నారు.

Related Posts
తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
President Droupadi Murmu ex

తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 40 మందికి పైగా గాయపడినట్లు అధికారులు Read more

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సోనూసూద్ సహాయం!

వివరాల్లోకి వెళ్ళగా నటుడు మరియు దాత సోను సూద్ మరొకసారి ఆయన సేవ హయధేయన్ని చాటుకున్నారు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును Read more

శ్రీశైల దేవస్థానంలో పదోన్నతులపై హైకోర్టు మొట్టికాయలు
srisailam

శ్రీశైల దేవస్థానంలో ఏడాది జనవరి 16న ఇచ్చిన పదోన్నతుల్లో అనర్హులకు లబ్దిపొందారు. ఈ పదోన్నతులను సవాల్ చేస్తూ పలువురు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై Read more

దావోస్‌లో చంద్రబాబు డ్రీమ్
దావోస్‌లో చంద్రబాబు డ్రీమ్

30 సంవత్సరాల క్రితం ఓ సమయం గుర్తు చేసుకోండి. ఓ యువ, మహత్వాకాంక్షి నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు, తన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద కలలు కంటున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *