కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మరోసారి తన మాస్ ఇమేజ్‌ను తెరపై చూపించాడు. ‘మ్యాక్స్’ అనే ఈ యాక్షన్ డ్రామాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన అదిరిపోయే నటన కనబరిచాడు. అయితే ఈ మూవీ డిసెంబర్ 25, 2023న థియేటర్లకు మ్యాక్స్ మూవీ వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నిన్న రాత్రి నుంచి ‘జీ 5’లో తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

మూవీ సారాంశం:
రాజకీయంగా బలమైన నేతలైన పరశురామ్ (శరత్ లోహితస్య), డేనియల్ (ఆడుకాలం నరేన్) తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. పోలీసులే వారికి భయపడే పరిస్థితి. అలాంటి వేళ కొత్త పోలీస్ ఆఫీసర్‌గా మ్యాక్స్ ఆ ఊరికి వస్తాడు. అతని రాకతో రాజకీయ నాయకుల కుటుంబాలపై ప్రభావం పడుతుంది.
పరశురామ్ – డేనియల్ కొడుకులైన మైఖేల్ – వీరా ఇద్దరూ మంచి స్నేహితులు. తండ్రుల అధికారం చూసుకుని, ఇద్దరూ తమ ఇష్టానుసారంగా నడచుకుంటూ ఉంటారు. ఒకసారి వాళ్లు పోలీసులపై చేయిచేసుకోవడంతో, మ్యాక్స్ వాళ్లను అరెస్టు చేసి సెల్లో వేస్తాడు. అయితే అనుమానస్పద స్థితిలో వాళ్లిద్దరూ చనిపోతారు. అది ఎలా జరిగిందనేది ఎవరికీ తెలియక అయోమయానికి లోనవుతారు. ఈ విషయం పరశురామ్ – డేనియల్ కి తెలిస్తే తమని చంపేస్తారని పోలీసులు భయపడుతూ ఉంటారు.
మైఖేల్ – వీరా ఇద్దరి శవాలను అక్కడి నుంచి రహస్యంగా తరలించేద్దామనీ, తాము వాళ్లని వదిలేసినట్టుగా పరశురామ్ గ్యాంగ్ తో చెబుదామని మ్యాక్స్ అంటాడు. అందుకు అందరూ ఒప్పుకుంటారు. ఆ ఇద్దరి శవాలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుండగానే, పరశురామ్ – డేనియల్ అనుచరులు పోలీస్ స్టేషన్ ను చుట్టుముడతారు. అప్పుడు మ్యాక్స్ ఏం చేస్తాడు? ఆ రాజకీయనాయకుల వలన పోలీసులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? మైఖేల్ – వీరా మరణానికి కారకులు ఎవరు? అనేది మిగతా కథ.
సినిమాలో కీలకమైన అంశాలు:
-పోలీస్ Vs రాజకీయనాయకులు – అధికారం చేతిలో ఉన్న నేతలు ఎలా వ్యవహరిస్తారనే అంశాన్ని చిత్రీకరించారు.
-ఆఫీసర్ ‘మ్యాక్స్’ ధైర్యసాహసాలు – అన్యాయాన్ని ఎదుర్కొని న్యాయం కోసం పోరాడే పోలీస్ క్యారెక్టర్.
-స్క్రీన్ ప్లే & థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ – కథనం ఓ స్థాయిలో ఆసక్తికరంగా సాగినా, కొన్ని చోట్ల స్లో అయింది.
–క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రూప (వరలక్ష్మి శరత్ కుమార్) ఎంట్రీ – కథలో మరింత ఉత్కంఠను పెంచే పాత్ర.
సుదీప్ తన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర శక్తివంతంగా కనిపించినా, గ్రాఫ్ అంతగా ఎలివేట్ కాలేదు. శరత్ లోహితస్య, ఆడుకాలం నరేన్, సునీల్ కీలక పాత్రల్లో ఉన్నా, కథలో వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కలేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్సి నిమాటోగ్రఫీ (శేఖర్ చంద్ర) – విజువల్స్ బాగున్నాయి.
బీజీఎం (అజనీశ్ లోక్ నాథ్) – కథకు అనుగుణంగా ఉత్కంఠ పెంచే సంగీతం.
ఎడిటింగ్ (గణేశ్ బాబు) – కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి చేయవచ్చని అనిపిస్తుంది.
మ్యాక్స్లో కొన్ని మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, కథ, స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఖైదీ స్టైల్ కథనం కలిగిన ఈ సినిమా కొంతవరకు ఆకట్టుకుంటుంది. అయితే కథని ఇంకా కొత్త కోణంలో చూపించి ఉంటే, సినిమా మరింత రిచ్ అయ్యేది. మొత్తంగా ఇది యావరేజ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.