యువతుల ప్రైవేట్ వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యవహారంలో అరెస్టయిన ముస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. మస్తాన్ సాయి , అతడి స్నేహితుడు ఖాజాకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయినట్లు రిమాండ్ రిపోర్ట్ ధార వెల్లడయింది.డ్రగ్స్ మత్తులో లావణ్య ఇంటికి మస్తాన్ సాయి వెళ్లి గొడవ చేశాడు. మహిళల ప్రైవేట్ వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని ఆమె ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ హార్క్ డిస్క్ లో మహిళలకు చెందిన ఫోటోలు, వీడియోలున్నాయని ఆమె తెలిపారు. ఈ హర్డ్ డిస్క్ కోసం తనపై దాడి చేసేందుకు తన ఇంటికి వచ్చారని మస్తాన్ సాయి, ఖాజాపై ఆమె ఫిర్యాదు చేశారు.

. అయితే ఆలోపే ఇతర డివైస్ లలోకి ఆ వీడియోలను మస్తాన్ సాయి కాపీ చేసుకున్నాడు. లావణ్యను పలు మార్లు చంపేందుకు అతడు ప్రయత్నిచాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. గత నెల ౩౦న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లు వెల్లడించారు. అయితే అప్పటికే ఆ వీడియోలను మస్తాన్ మరొక హార్డ్ డిస్క్ లో భద్రపర్చారు.ఈ హర్డ్ డిస్క్ ను 2024 నవంబర్ లో లావణ్య మస్తాన్ సాయి ఇంటి నుంచి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఈ హర్డ్ డిస్క్ కోసం మస్తాన్ సాయి లావణ్యను చంపేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిలో డ్రగ్స్ ఆనవాళ్లు లభించాయని పోలీసులు ఆ రిపోర్టులో తెలిపారు.
తన మాదిరిగా ఎవరికి నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మస్తాన్ సాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు లావణ్య చెబుతున్నారు. లావణ్య ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించాలని భావిస్తున్నారు. దీని కోసం కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.