Massive encounter in Chhattisgarh... 8 Maoists killed

ఎదురు కాల్పులు.. 8 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా గంగులూర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్‌ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది.

Advertisements
image

ప్రస్తుతం ఇంకా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉన్నది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగులుతున్నది. పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి చలపతితో పాటు 16 మంది వరకు మావోలు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. తాజాగా జరిగిర ఎన్‌కౌంటర్‌లో మరో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు.

కాగా, మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హామీ ఇచ్చినప్పటి నుంచి.. నక్సల్స్‌కు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్లు చేస్తున్న పోలీసులు, భద్రతా బలగాలు.. మావోయిస్టులకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో తరచూ సెక్యూరిటీ ఫోర్స్, నక్సల్స్‌కు మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు.

Related Posts
Wine: ఓ టీచర్ ఘనకార్యం విద్యార్థులతో మద్యం తాగించిన వైనం
Wine: ఓ టీచర్ ఘనకార్యం విద్యార్థులతో మద్యం తాగించిన వైనం

మధ్యప్రదేశ్‌లో దారుణం: తరగతి గదిలో మద్యం సేవించి విద్యార్థులతోనూ తాగించిన ఉపాధ్యాయుడు! మధ్యప్రదేశ్ రాష్ట్రం కట్ని జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేసిన కీచకచర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా Read more

Mehul Choksi : వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్టు !
Diamond merchant Mehul Choksi arrested!

Mehul Choksi : ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు Read more

ఉద్యోగుల రిటైర్మెంట్ బకాయిలపై CM కీలక ప్రకటన
Revanth Reddy నరేంద్ర మోదీ మంత్రులకు పెద్దన్న లాంటి వారు రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61కి పెంచిన గత ప్రభుత్వ నిర్ణయం వెనుక అసలు ఉద్దేశ్యం వారి బకాయిలను ఎగ్గొట్టడమేనని ముఖ్యమంత్రి రేవంత్ Read more

TGPSC: గ్రూప్-1అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు విడుదల
గ్రూప్-1 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు రిలీజ్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలక దశను చేరుకుంది. ఇటీవల నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో ప్రదర్శన ఆధారంగా రూపొందించిన జనరల్ Read more

Advertisements
×