భారతదేశంలో అత్యున్నత దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న మణిరత్నం, తన సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రేమకథలను సామాజిక సమస్యలతో ముడిపెట్టి రూపొందించే ఆయన చిత్రాలు, ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. భారతీయ సినిమా పరిశ్రమలో మణిరత్నం పేరు తెలియని ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందరో టాప్ స్టార్లతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకాదరణ పొందిన ఆయన, ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అనే పేరు తెచ్చుకున్నారు.ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ భారీ చారిత్రక చిత్రం, బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఈ విజయంతో మణిరత్నం మళ్లీ టాప్ డైరెక్టర్‌లలో ఒకరిగా నిలిచారు.మణిరత్నం సినిమా ఇండస్ట్రీలో మణిరత్నం పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించి ప్రేక్షాదరణ అందుకున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమా తర్వాత మణిరత్నం ఓ యంగ్ హీరోతో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఆ యంగ్ హీరో ఎవరో కాదు తెలుగులో తన టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నవీన్ పోలిశెట్టి. తెలుగులో ఈ యంగ్ హీరో చేసిన సినిమాలు తక్కువే కానీ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఆతర్వాత జాతిరత్నాలు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆతర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో హీరోయిన్ గా అనుష్క శెట్టి నటించింది. ఈ మూవీ తర్వాత నవీన్ ఓ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు. త్వరలోనే ఈ యంగ్ హీరో మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథతో తెరకెక్కుతోందని తెలుస్తుంది.

అయితే ఆ తర్వాత కొత్త అవకాశాలు అందుకోవడంలో వెనుకబడ్డాడు. ప్రస్తుతం నవీన్ చేతిలో ఒక సినిమానే ఉంది. అదే అనగనగా ఒకరోజు చిత్రం. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఇంతలోనే మణిరత్నం కాంపౌండ్ లో నవీన్ అనే వార్త సంచలనంగా మారింది. ఈ అవకాశం నిజమైతే? నటుడిగా నవీన్ మరింత షైన్ అవుతాడు. నవీన్ కున్న యూత్ ఫాలోయింగ్ కి సరైన లవ్ స్టోరీ పడితే? లవర్ బోయ్ ఇమేజ్ తో తిరుగులేని స్థాయికి వెళ్తాడు. మరి అంతటి అదృష్టం నవీన్ కి ఉందా? లేదా? అన్నది చూడాలి. ప్రస్తుతం మణిరత్నం థగ్ లైఫ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
కమల్ హాసన్‌తో ‘థగ్‌లైఫ్’
పొన్నియన్ సెల్వన్ తర్వాత, మణిరత్నం తన తదుపరి చిత్రంగా కమల్ హాసన్‌తో కలిసి థగ్‌లైఫ్ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మణిరత్నం తన మార్క్ స్క్రీన్ ప్లేతో మరో హిట్ సినిమా ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.