Mangalagiri Police Notices to YCP Leaders Sajjala Ramakrishna Reddy

సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు

అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు వైఎస్‌ఆర్‌సీపీ కీలక నేతల మెడ చుట్టూ బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నేతలను విచారించిన పోలీసులు తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు జారీచేశారు. విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ప్రమేయం కూడా ఉందని గుర్తించిన పోలీసులు ఆయన దేశం విడిచి పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు. దీంతో నిన్న ఆయనను ఢిల్లీ విమానాశ్రయం పోలీసులు అడ్డుకుని తిరిగి వెనక్కి పంపారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ఆయనకు నోటీసులు జారీచేశారు.

19 అక్టోబర్ 2021న వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. ఈ కేసులో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంలను పోలీసులు ఇప్పటికే పలు దఫాలుగా పిలిచి, విచారించారు. కేసు కీలక దశలో ఉండడంతో దాడితో ప్రమేయం ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ముఖ్య నేతలను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే సజ్జలకు నోటీసులు జారీ చేశారు.

Related Posts
ఐపీఎల్ 2025 ప్రారంభ తేదీని ప్రకటించిన బీసీసీఐ
ఐపీఎల్ 2025 ప్రారంభ తేదీని ప్రకటించిన బీసీసీఐ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025 మార్చి 23 న ప్రారంభమవుతుందని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ధృవీకరించారు. జనవరి 12 ఆదివారం నాడు జరిగిన బిసిసిఐ Read more

ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం..
Two judges who took oath in AP High Court

అమరావతి : ఏపీ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్‌ యడవల్లి Read more

ఏపి, తమిళనాడును కలుపుతూ కొత్తగా జాతీయ రహదారి
ap, tamilnadu

కేంద్రంలో, రాష్ట్రంలో.. రెండుచోట్లా ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పదే పదే చెబుతుంటారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివృద్ధిని ఉదహరిస్తుంటారు. ప్రస్తుతం Read more

సామ్‌సంగ్ విండ్‌ఫ్రీ ఎయిర్ కండిషనర్లు విడుదల
Samsung Launches Windfree Air Conditioners

గురుగ్రామ్ : నిద్ర దశల ప్రకారం ఉష్ణోగ్రతను సర్దుబాటు చేయడం ద్వారా రాత్రంతా ఆహ్లాదకరమైన నిద్రను ప్రోత్సహించడానికి సామ్‌సంగ్ ‘గుడ్ స్లీప్’ మోడ్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *