manoj vishnu

మంచు బ్ర‌ద‌ర్స్ వార్ మళ్లీ మొదలు

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కారణంగా మంచు మనోజ్‌ మరియు మంచు విష్ణు మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా వీరి మధ్య విమర్శలు తారాస్థాయికి వెళ్లడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి కేసులు కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Advertisements

ఈ క్రమంలో ఈరోజు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో “సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా” అంటూ ఒక పోస్టు షేర్‌ చేశాడు. దీనితో పాటు, తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి నటించిన రౌడీ సినిమా ఆడియో క్లిప్‌ను జతచేశాడు. ఈ వ్యాఖ్యలు మంచు మనోజ్‌ను ఉద్దేశించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

దీనికి ప్రతిస్పందనగా మంచు మనోజ్ తన ఎక్స్ ఖాతాలో కౌంటర్ ఇస్తూ “కృష్ణంరాజు గారి లాగా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకీ ఉంటుంది” అంటూ ఘాటుగా స్పందించాడు. తన పోస్ట్‌కు #VisMith అనే హ్యాష్‌ట్యాగ్ జోడించి, మంచు విష్ణు ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక క్లూ ఇచ్చాడు. ఈ పోస్టులు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వీరి మాటల యుద్ధం చూసి అభిమానులు మరియు నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వారి కుటుంబ సమస్యలు వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలని కొందరు సూచిస్తుండగా, మరికొందరు ఈ వివాదం గందరగోళానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు బ్రదర్స్ మధ్య గత కొన్ని నెలలుగా వివాదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి గొడవలు మంచు కుటుంబానికి, వారి అభిమాని వర్గానికి తీవ్ర మనస్థాపం కలిగిస్తున్నాయి. అయితే ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచిచూడాల్సి ఉంది.

Related Posts
ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి

అమరావతి: సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వేమిరెడ్డి Read more

Hyderabad : తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల బీభత్స వాన
Hyderabad తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల బీభత్స వాన

Hyderabad : తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగండ్ల బీభత్స వాన తెలంగాణలో వడగండ్ల వాన ఉధృతి తీవ్రంగా ఉంది.నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల Read more

CEC : కంచ గచ్చిబౌలి భూములపై సీఈసీ కీలక నివేదిక
CEC's key report on Kanche Gachibowli lands

CEC : తెలంగాణలో గచ్చిబౌలి భూముల విషయంలో పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా కేంద్ర సాధికారిక కమిటీ (సీఈసీ) ఒక కీలక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో పలు Read more

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
AP Cabinet Decisions

అమరావతిలోని సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. మంత్రివర్గంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కూలంకషంగా చర్చ జరగ్గా.. కొన్ని విషయాల్లో సీఎం చంద్రబాబు మంత్రులకు Read more

×