మైక్‌ కట్‌..నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను వాకౌట్‌ చేసిన సీఎం మమతా బెనర్జీ

Mamata Banerjee claims mic muted at PM-led Niti Aayog meet, Centre rebuffs

న్యూఢిల్లీ : ఢిల్లీలో నేడు ప్రధాని మోడి అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరైన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సభ మధ్యలోనే వాకౌట్‌ చేశారు. సమావేశంలో ఇతరులు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారని, అయితే తనకు కేవలం 5 నిమిషాలు మాత్రమే మాట్లాడటానికి అనుమతించారని మమతా తెలిపారు. మిగతా సభ్యుల మాదిరిగానే మాట్లాడేందుకు తనకు తగిన సమయం ఇవ్వకపోవడం అవమానించడమేనన్నారు. బెంగాల్‌కు నిధులు ఇవ్వాలని కోరినప్పుడు, ప్రణాళికా సంఘాన్ని తిరిగి తీసుకురావాలని, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల గురించి ఆలోచించాలని, వివక్ష చూపవద్దని కోరినప్పుడు తన మైక్‌ను మ్యూట్‌ చేశారని ఆరోపించారు. ఈ చర్య బెంగాల్‌కు అవమానంగా భావించిన మమతా బెనర్జీ సభ నుండి బయటకు వచ్చేశారు. ఆమె చర్యపై బిజెపి స్పందిస్తూ … విపక్షాలకు చెందిన కొందరు బాయ్ కాట్‌ చేసేందుకు నీతి ఆయోగ్‌ను ఒక వేదికగా మార్చుకున్నారని విమర్శించింది.