Malla Reddy who meet CM Revanth Reddy

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మల్లారెడ్డి

హైదరాబాద్‌ఫ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి తన మనవరాలి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. కుటుంబ సమేతంగా తన మనవరాలి వివాహానికి రావాలని పెళ్లి పత్రికను సీఎంకు మల్లారెడ్డి అందించారు. సీఎంతో పాటు మల్లారెడ్డి కలిసిన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఉన్నారు.

కాగా, రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును మల్లారెడ్డి కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏపీ సీఎంతో తీగల కృష్ణారెడ్డి సైతం ఉన్నారు. ఇదిలా ఉండగా మల్లారెడ్డి అల్లుడు అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలను ఆహ్వానిస్తున్నారు.

ఇకపోతే..గతంలో వీరిద్దరూ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ముందుగా మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టారు. దాంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని వార్తలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి చేరికను రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని మల్లారెడ్డి అనుచరులు ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Related Posts
బఫర్ జోన్‌లో ఆక్రమణలను కూల్చిన హైడ్రా
khajanaguda cheruvu

ఈ ఏడాది హైదరాబాద్ లో పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్నది. దీనిపై హై కోర్ట్ కూడా పలు ఆంక్షలను విధించింది. తాజాగా ఈ ఏడాది చివరి Read more

భారత్‌-చైనా మధ్య నేరుగా విమానాలు: జైశంకర్‌, చైనా మంత్రితో చర్చలు
jai shankar scaled

భారత్‌ విదేశాంగ మంత్రిగా ఎస్‌.జైశంకర్‌ రియోలో చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. ఈ చర్చలు రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా కేంద్రీకరించాయి. Read more

VIDEO: వింటేజ్ రమణ గోగులను గుర్తు చేశాడుగా..
ramanagogula godari

సంగీత దర్శకుడు రమణ గోగుల సింగర్గా రీఎంట్రీ ఇస్తున్నారు. వెంకటేశ్ నటిస్తోన్న 'సంక్రాంతికి వస్తున్నాం'లో ఆయన ఓ పాట పాడారు. తన తొలి సినిమాకు వెంకీనే హీరో Read more

జమ్మూ లో కాంగ్రెస్ ..హర్యానా లో బిజెపి విజయం
jK haryana results

కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లారు హర్యానా ప్రజలు..జమ్మూ & హర్యానా లో కాంగ్రెస్ విజయం కహాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పడం తో కాంగ్రెస్ శ్రేణులు ఉదయమే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *