మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు

Andhra: మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి..డబ్బులు వసూలు

మహిళతో న్యూడ్ కాల్స్ చేయించి.. వాటిని రికార్డ్ చేసి, బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న గ్యాంగ్‌ను కటకటాల్లోకి పంపారు లేపాక్షి పోలీసులు. మొత్తం నలుగురు నిందితుల అరెస్టు చేశారు. లేపాక్షి మండలం కొండూరు గ్రామానికి చెందిన ధనుంజయ, రవికుమార్, రమేశ్​తో పాటు ఆ మహిళను అరెస్టు చేసి వారిని ఆదివారం రిమాండ్​కు​ తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరుకు చెందిన ధనుంజయ్ అనే యువకుడు ఈ కేసులో ప్రధాన నిందితుడని తేల్చారు. ధనుంజయ్ ట్రాప్‌లో చిక్కుకుని.. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లక్షా యాభై వేలు నిందితులకు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన లేపాక్షి పోలీసులు.. ఎంక్వైరీ చేయగా డొంక కదిలింది. ధనుంజయ్ గ్యాంగ్ చాలామందిని మోసం చేసిందని గుర్తించారు. ఓ రెవిన్యూ సెక్రెటరీ నుంచి దాదాపు మూడు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తేల్చారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు.. 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మహిళ సహా నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఉన్నట్లు లేపాక్షి మండలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements
Related Posts
జనసేన ఆవిర్భావ సభకు ‘జయకేతనం’ అనే పేరు
janasena jayakethanam

జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 14న గ్రాండ్‌గా నిర్వహించేందుకు పార్టీ సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రత్యేక సభకు ‘జయకేతనం’ అనే పేరు జనసేన Read more

టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి!
టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి!

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రులకు కొత్త రాజధానిగా అమరావతి ప్రాంతం ప్రతిపాదించబడిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయ పార్టీల మార్పుల ఈ ప్రాజెక్టుపై నీలినీడలు Read more

రెండు నెలలు ఆ రైళ్లు బంద్
South Central Railway has announced 26 special trains for Sankranti

కుంభమేళా నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్సవానికి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు పలు సాధారణ రైళ్లను మార్చి 1 వరకు Read more

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర ట్రస్టుకు బెదిరింపులు
అయోధ్య రామ మందిర ట్రస్టుకు బెదిరింపులు

అయోధ్య… శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అనుమానాస్పద మెయిల్ వచ్చింది. ఈ మెయిల్‌లో రామాలయ భద్రత గురించి ట్రస్ట్‌కు హెచ్చరిక కనిపించింది.. ఆ మెయిల్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×