రైతులకు ఫ్రీగా పంప్ సెట్లు – సీఎం రేవంత్

CM Revanth Reddy

తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్..రైతులకు వరుస తీపి కబుర్లు తెలియజేస్తూ వస్తుంది. రీసెంట్ గా రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల్లో సంతోషం నింపిన సీఎం రేవంత్..తాజాగా మరో గుడ్ న్యూస్ అందించారు. రైతులను సోలార్ విద్యుత్ వైపు ప్రోత్సహించాలని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘భవిష్యత్ అవసరాల దృష్ట్యా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలి. వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. రైతులకు సోలార్ పంప్ సెట్లు ఫ్రీగా ఇవ్వాలి. మిగులు విద్యుత్పై ఆదాయం వచ్చేలా ప్రణాళికలు చేయాలి. కొండారెడ్డిపల్లిలో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలి’ అని విద్యుత్ శాఖపై సమీక్షలో CM ఆదేశించారు.

రాబోయే రోజుల్లో ఒక బిజినెస్ హబ్‌గా మారబోతున్న తెలంగాణలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలసి సీఎం తన నివాసంలో విద్యుత్‌శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్‌ రాస్, రెండు డిస్కంల సీఎండీలు ముషారఫ్, వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.