15 నిమిషాల్లో పనిమనిషి మీ ఇంటికి, అర్బన్ కంపెనీ కొత్త సర్వీస్

urban company : 15 నిమిషాల్లో పనిమనిషి మీ ఇంటికి, అర్బన్ కంపెనీ కొత్త సర్వీస్

చాల మంది మహిళలకు ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకోవడంతోనే రోజంతా సరిపోతుంది. ఇక అందులో ఇంటి పని అంటే అసలు టైం సరిపోదు. అందుకే ఎక్కువ శాతం సిటీ నగరాల్లో ఇంటి పనికి పనిమనుషులు పెట్టుకుంటారు. ఒకోసారి పనిమనుషులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది అందులో ఇంటి పనికి మరీ ముఖ్యం. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అర్బన్ కంపెనీ ఇప్పుడు ఇన్స్టంట్ మెయిడ్ సర్వీస్ అందిస్తుంది. ‘ఇన్‌స్టా మెయిడ్స్’ అనే ఈ కొత్త సర్వీస్ ముంబైలో ప్రారంభమైంది. ఈ సర్వీస్ ద్వారా పనిమనిషి కేవలం 15 నిమిషాల్లో మీ ఇంటికి చేరుకుంటుంది.
ఒక గంటకు రూ. 49 మాత్రమే ..
ప్రస్తుతం ఈ సర్వీస్ ప్రయోగాత్మకంగా నడుస్తోంది. అలాగే ఇతర నగరాల్లో ప్రారంభమవుతుందో లేదో చూడాలి. ప్రారంభ ఆఫర్ కింద, మీరు ఒక గంటకు రూ. 49 మాత్రమే చెల్లించాలి, అయితే అసలు ధర గంటకు రూ. 245. అర్బన్ కంపెనీ ‘ఇన్‌స్టా మెయిడ్స్’ అనే కొత్త సర్వీస్ ప్రారంభించింది. దీని కింద కస్టమర్లకు 15 నిమిషాల్లో పనిమనిషి లభిస్తుంది. దీనితో పాటు కంపెనీ ‘క్విక్ కామర్స్’ రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది. ఈ సర్వీస్ ధర గంటకు రూ.245 అని కంపెనీ ఫేస్‌బుక్‌లో తెలిపింది. కానీ, ప్రారంభ ఆఫర్‌ కింద కస్టమర్‌లు గంటకు రూ.49కే ఈ సర్వీస్ లభిస్తుంది.

Advertisements
15 నిమిషాల్లో పనిమనిషి మీ ఇంటికి, అర్బన్ కంపెనీ కొత్త సర్వీస్

అందుబాటులో ఈ సర్వీస్
మనీకంట్రోల్ ప్రకారం, ఈ సర్వీస్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. దీనిని ముంబైలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అర్బన్ కంపెనీ ఇప్పటికే సేవలను అందిస్తున్న ఇతర నగరాల్లో దీనిని ప్రారంభిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ‘ఇన్‌స్టా మెయిడ్స్’లో డిష్‌వాషింగ్, ఇల్లు ఊడ్చడం, ఇల్లు తుడవడం, వంట చేయడం వంటి చాల రకాల సర్వీసెస్ ఉంటాయి, వీటిని సాధారణంగా ఇంటి పనిమనిషి నిర్వహిస్తారు.

Related Posts
రాందేవ్‌ బాబాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ
Non bailable warrant issued against Ramdev Baba

తిరువనంతపురం : యోగా గురు బాబా రాందేవ్‌కు కేరళలో కోర్టు ఒకటి నాన్‌బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలను విస్మరించినందుకు పాలక్కాడ్‌లోని జ్యడీషియల్‌ Read more

జమిలి జేపీసీలో ప్రియాంకాగాంధీ?
priyanka

‘వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లుపై ఏర్పాటు కాబోతున్న జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) లో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్‌ ఎంపీ ప్రియాంకాగాంధీ Read more

టెస్లా మాస్ ఎంట్రీ.. ముంబైలో భారీ షోరూమ్!
టెస్లా మాస్ ఎంట్రీ.. ముంబైలో భారీ షోరూమ్!

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు రెడీ అవుతుంది. అయితే మొదటి దశలో ముంబైలోని బాంద్రా కుర్లా Read more

జమ్ము కశ్మీర్‌లో భారీగా మంచు వర్షం
snow

జమ్ము కశ్మీర్‌లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ మంచు కంటే అధికంగా మంచు కురుస్తోంది. జనజీవనం అతలాకుతలం Read more

×