అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మహ్మదుల్లా రిటైర్మెంట్

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మహ్మదుల్లా రిటైర్మెంట్

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన స్టార్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2007లో అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 17 ఏళ్లకు పైగా బంగ్లాదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 39 ఏళ్ల మహ్మదుల్లా బుధవారం తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా తన సహచర క్రికెటర్లు, కోచ్‌లు, అభిమానులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మహ్మదుల్లా రిటైర్మెంట్

“అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించడం నా జీవితంలో ఎంతో భావోద్వేగపూరితమైన క్షణం. నాకు ఎప్పుడూ తోడుగా ఉన్న సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, ముఖ్యంగా నాపై అపారమైన ప్రేమ చూపించిన అభిమానులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా తల్లిదండ్రులకు, అత్తమామలకు ప్రత్యేక ధన్యవాదాలు. చిన్నప్పటి నుంచి నా కోచ్, మెంటార్‌గా నాకు మార్గనిర్దేశం చేసిన నా సోదరుడు ఎమ్దాద్ ఉల్లాకు ప్రత్యేక కృతజ్ఞతలు,” అని మహ్మదుల్లా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

అద్భుత ప్రదర్శనలు

2007లో శ్రీలంకతో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మహ్మదుల్లా, అప్పటి నుంచి బంగ్లాదేశ్ జట్టులో ఒక కీలక ఆటగాడిగా కొనసాగాడు. తన కెరీర్‌లో 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 11,047 పరుగులు సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అతడు తన ప్రతిభను చాటాడు. టెస్టుల్లో 42 వికెట్లు, వన్డేల్లో 81 వికెట్లు, టీ20ల్లో 41 వికెట్లు పడగొట్టాడు.

ఏకైక బంగ్లా బ్యాట్స్‌ మ్యాన్

బంగ్లాదేశ్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా మహ్మదుల్లా నిలిచాడు. ప్రపంచకప్‌ల్లో మూడు సెంచరీలు చేసిన ఏకైక బంగ్లా బ్యాట్స్‌ మ్యాన్ గా ఘనత సాధించాడు. ముఖ్యంగా, 2015 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. ఆ సీజన్‌లో బంగ్లాదేశ్ క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. 2023 ప్రపంచకప్‌లోనూ మరో శతకం నమోదు చేశాడు.

1741792889782 FotoJet 2025 03 12T205122

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

2023 ప్రపంచకప్‌లోనూ ఓ సెంచరీ చేశాడు.అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, మహ్మదుల్లా స్థానిక లీగ్‌ల్లో ఇంకా కొనసాగవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నమెంట్‌లలో అతడు ఇంకా క్రికెట్ ఆడే అవకాశం ఉంది.క్రికెట్ ప్రేమికులు మహ్మదుల్లా రిటైర్మెంట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బంగ్లా క్రికెట్‌కు అతడు అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు.

Related Posts
పాక్ తో బంగ్లాదేశ్‌‌‌‌ స్నేహం భారత్ కు కొత్త సమస్యలు
haseena

షేక్ హసీనా సర్కార్ పడిపోయిన తర్వాత.. బంగ్లాదేశ్ పరిస్థితి దిగజారుతూ వస్తోంది. మతోన్మాదం, దాడులు, హింస, అశాంతి, అంతర్గత కలహాలతో బంగ్లాదేశ్ నిత్యం ఒక నరకంలా మారిపోతోంది. Read more

కరేబియన్‌లో భారత విద్యార్ధిని గల్లంతు
కరేబియన్‌లో భారత విద్యార్థిని గల్లంతు – కుటుంబం ఆందోళనలో

అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి అనే భారత సంతతికి చెందిన యువ విద్యార్థిని అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సుదీక్ష గత Read more

భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?
భారతదేశానికి వ్యతిరేకంగా ట్రూడో ఆరోపణలు: పతనానికి మలుపు?

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రస్తుతం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఆయన రాజీనామాకు దారితీయవచ్చు. లిబరల్ పార్టీలో ఒంటరిగా మారిన ట్రూడో, క్షీణిస్తున్న Read more

ఇథియోపియా లారీ నదిలో పడి 71 మంది మృతి
Ethiopia

దక్షిణ ఇథియోపియాలోని సిడామా రాష్ట్రంలో ఆదివారం ఒక దారుణమైన ప్రమాదం జరిగింది. ఓ లారీ వాహనం వంతెనను తప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 71 Read more