‘కల్కి’ అద్భుతం – మహేష్ బాబు

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 AD తెరకెక్కింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణె, దిశా పటాని, యూనివర్స్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, సీనియర్ నటి శోభన, మాళవిక నాయర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. వరల్డ్ వైడ్ గా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు..బాక్స్ ఆఫీస్ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు సిద్ధంగా ఉంది.

ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా అద్భుతం అంటూ కితాబు ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా చూసి తన స్పందనను తెలియజేసారు. ‘‘కల్కి ఓ అద్భుతం.. జస్ట్‌ వావ్‌. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండంలా ఉంది. అమితాబ్‌ బచ్చన్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌కు ఎవరూ సరితూగరు. కమల్‌ హాసన్‌ ప్రతి పాత్రకు జీవం పోస్తారు. ప్రభాస్‌ గొప్ప క్యారెక్టర్‌లో చాలా సులభంగా నటించారు. దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించారు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు’’ అని మహేశ్ బాబు కల్కి టీమ్ ఫై ప్రశంసలు కురిపించారు.