సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రం గురించి ప్ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలోని ప్రసిద్ధ బొర్రా గుహల్లో చిత్రీకరించాలని రాజమౌళి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జక్కన్న తన టీమ్‌తో కలిసి గుహల ప్రాంతాన్ని పరిశీలించినట్లు సమాచారం.
SSMB29గా పిలవబడుతున్న ఈ సినిమా కథ ప్రకారం, అధికశాతం టాకీ పార్ట్‌ను ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఇందులోని కొన్ని కీలక సన్నివేశాలు సహజ సౌందర్యం అవసరం కావడంతో బొర్రా గుహలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గుహల్లో చిత్రీకరణ వల్ల ఆ ప్రాంతం మరింత ప్రసిద్ధి చెందుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చిత్రం మహేశ్ బాబు కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైనదిగా ఉండబోతుందని రాజమౌళి ఇప్పటికే వెల్లడించారు. సాహసోపేతమైన కథతో రూపొందనున్న ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్, భారీ సెట్స్ ఉపయోగించనున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ చిత్రానికి పనిచేయనున్నట్లు టాక్.
ఇదిలా ఉండగా, సినిమాలో మహేశ్ బాబుకు జోడీగా బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ప్రియాంక, ఈ సినిమాతో మరోసారి తెలుగులోకి అడుగుపెడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ భారీ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించిందని సమాచారం.