GOLD : మహేష్ – రాజమౌళి ‘గోల్డ్ ‘..ఎంత నిజం..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ మూవీ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి ఈ సినిమా ఫై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ కూడా తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు.

ఇదిలా ఉంటె ఈ సినిమాకు సంబదించిన రోజుకో అప్డేట్ బయటకు వస్తూ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ గోల్డ్ అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో సూపర్ స్టార్ కు ఈ టైటిల్ కరెక్ట్ గా సరిపోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.