Madras High Court question to spiritual guru Jaggi Vasudev

ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు మద్రాసు హైకోర్టు ప్రశ్న

Madras High Court question to spiritual guru Jaggi Vasudev

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా ఫౌండేషన్‌పై మద్రాసు హైకోర్టు సీరియస్ అయ్యింది. అంతేకాకుండా వాసుదేవ్‌కు పలు ప్రశ్నలు సంధించింది. తమ కూతుర్లకు పెళ్లి చేసిన సద్గురు ఇతరుల పిల్లలను ఎందుకు పెళ్లి చేసుకోవద్దని బ్రెయిన్ వాష్ చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే ఇషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

‘తన కూతురుకి పెళ్లి చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన వ్యక్తి ఇతరుల కూతుళ్లను సన్యాసిగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నాం. అనే సందేహాన్ని’ ధర్మాసనం వ్యక్తం చేసింది. కోయంబత్తూరుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెబుతూ అక్టోబర్ 4న విచారణను వాయిదా వేసింది. అయితే, 42, 39 ఏళ్ల వయస్సు గల “బాగా చదువుకున్న తన కుమార్తెలకు సద్గురు “బ్రెయిన్ వాష్” చేశారని ఆరోపిస్తూ కామరాజ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Related Posts
నేత‌ల్ని త‌ప్పుప‌ట్టిన కంగ‌నా రనౌత్‌
kangana ranaut

గత కొంతకాలంగా ఎమ‌ర్జెన్సీ చిత్రంపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా ఎమ‌ర్జెన్సీ ఫిల్మ్‌కు బ్రిట‌న్ ఎంపీ బాబ్ బ్లాక్‌మాన్ మ‌ద్ద‌తు తెలిపారు. ఫిల్మ్ స్క్రీనింగ్‌ను అడ్డుకోవ‌డం భావ Read more

కేజ్రీవాల్‌ కేసు..ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
11 1

న్యూఢిల్లీ: ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. ఎక్సైజ్‌ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో తనపై Read more

కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైంది – కిషన్ రెడ్డి
kishan reddy warning

మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి..మరోసారి నవ్వులపాలైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి 251 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ ను Read more

8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి!
8hrsdaynigjt

డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల Read more